Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kiran Abbavaram: K-ర్యాంప్ కలెక్షన్ల కంటే ఆడియెన్స్ నవ్వులే నాకు సంతృప్తి : కిరణ్ అబ్బవరం

Advertiesment
Kiran Dance at K Ramp sucess

చిత్రాసేన్

, మంగళవారం, 4 నవంబరు 2025 (11:42 IST)
Kiran Dance at K Ramp sucess
ఐదు నెలల్లో సినిమా ఎలా కంప్లీట్ అయ్యిందో తెలియలేదు. మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా అందరం హ్యాపీగా ఉన్నామంటే అందుకు కారణం మా ప్రొడ్యూసర్స్ రాజేశ్, శివ. మొండి ధైర్యంతో వాళ్లు సినిమాను ముందుకు తీసుకెళ్లారు. మనం కలిసి మళ్లీ మూవీస్ చేద్దాం. నాకు ఇంకా పెద్ద సక్సెస్ లు రావొచ్చు గానీ కె ర్యాంప్ సినిమా మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా మిగిలిపోతుంది అని కిరణ్ అబ్బవరం అన్నారు.
 
K-ర్యాంప్ మూవీ థర్డ్ వీక్ ప్రదర్శితమవుతూ 40 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి దీపావళి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో సెలబ్రేషన్స్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నిర్మాత బండ్ల గణేష్ అతిథులుగా హాజరయ్యారు. అతిథుల చేతుల మీదుగా మూవీ టీమ్ కు జ్ఞాపికలు అందించారు.
 
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - సక్సెస్ సెలబ్రేషన్స్ కు మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, టీమ్ అందరూ వచ్చారు. మా సినిమా విజయాన్ని మా కంటే మీరంతా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. మా టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా మారిపోయాం.  సినిమా మనకు అన్నీ నేర్పింది. సంతోషాలు, ఒడిదొడుకులు..ఏవి ఎదురైనా మనమంతా కలిసే ఉన్నాం, ముందుకెళ్తున్నాం. ఈ సక్సెస్ మనందరికీ చాలా ముఖ్యం. ఈ సక్సెస్ ను మరికొన్ని రోజులు ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా.

డైరెక్టర్ నాని విషయంలో హ్యాపీగా ఉన్నాను. కొత్త డైరెక్టర్ కు సక్సెస్ వస్తే అతనితో పాటు అతని ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఫీలవుతారో తెలుసు. నాని మరిన్ని హిట్ చిత్రాలు చేయాలి. మా ప్రొడ్యూసర్స్ స్ట్రాంగ్ గా నిలబడినందుకే ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ మాకు దక్కింది. ఈ సినిమా ఎంత వసూళు చేసింది అనేదాని కంటే థియేటర్స్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి సినిమా చూస్తూ నవ్వుకోవడం హీరోగా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. పండక్కి మీ అందరినీ ఎంటర్ టైన్ చేయాలనే సినిమా చేశాం. ఆ నమ్మకం నిజం కావడం హ్యాపీగా ఉంది. మీ వాడిగా భావించి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. గతేడాది, ఈ ఏడాది దీపావళికి హిట్ ఇచ్చాం. మీ సపోర్ట్ ఉంటే వచ్చే దీపావళికి కూడా హిట్ సినిమా ఇస్తాను. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Meenakshi: ఎన్.సి.24 చిత్రం నుంచి పరిశోధకరాలిగా మీనాక్షి చౌదరి లుక్