Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తాళ్ళపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించిన వినరో భాగ్యము విష్ణు కథ యూనిట్

Vinarao team at tirupati
, సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (16:11 IST)
Vinarao team at tirupati
వినరో భాగ్యము విష్ణు కథ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ అన్ని మంచి  అంచనాలను క్రియేట్ చేసాయి. అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. నెంబర్ నైబరింగ్ కాన్సప్ట్ తో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న  థియేటర్స్ లో భారీగా విడుదల కాబోతుంది. ఈ తరుణంలో సినిమా ప్రోమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా "వినరో భాగ్యము విష్ణు కథ" చిత్ర యూనిట్ తిరుమల శ్రీ వేంటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
 
ఈ సినిమా ఎక్కువ శాతం తిరుపతిలోనే జరిగింది. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను కూడా తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. సినిమా ప్రొమోషన్స్ మొదలు పెట్టినప్పటినుండి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది చిత్ర యూనిట్. కళా తపశ్వి కే విశ్వనాధ్ గారిచే "వాసవ సుహాస" పాటను లాంచ్ చేయడం. అలానే నిన్న జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్ లో పన్నెండు తరాలకు సంబంధించిన  శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించడం విశేషం. 
 
ఒకవైపు సామాన్య ప్రజలచే సాంగ్స్ లాంచ్ చేయించడంతో పాటు, మరోవైపు పెద్దలకు తగిన గౌరవం ఇస్తూ వాళ్ళతో కొన్ని పాటలను లాంచ్  చేయించడం ఈ చిత్ర యూనిట్ ప్రత్యేకత. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ సభ్యుల మన్ననలు పొంది U/A సర్టిఫికెట్ ను సాధించుకుంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ సినిమాను,  GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయనతార ఇంటికి షారూఖ్ ఖాన్.. కారు వద్దుకెళ్లి ముద్దు పెట్టుకుంది (video)..