కోలీవుడ్‌లో సూపర్ హిట్టైన విక్రంవేద మూవీని తెలుగు రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన ఈ సినిమా తమిళంలో మంచి హిట్ సాధించింది. ఇంకా కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో ఆ సినిమాను బాలకృష్ణ, రాజశేఖర్ కలిసి చేస్తారని తెలుస్తుంది. అందులో ఒకరు గ్యాంగ్‌స్టర్ కాగా.. మరొకరు పోలీస్ పాత్ర చేస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్‌లో మూవీ చేస్తున్నాడు బాలయ్య. మరి ఈ రీమేక్ డైరక్షన్ ఎవరు చేస్తారు. బాలయ్య, రాజశేఖర్ నిజంగా ఈ సినిమా చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి తమిళంలో దర్శకత్వం వహించిన పుష్కర్ గాయత్రినే డైరక్షన్ పగ్గాలు చేపడుతారని తెలుస్తోంది.