Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్-విజయ్ సేతుపతి కాంబో..?

Advertiesment
Vijay Sethupathi
, సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (19:31 IST)
స్టార్ హీరోగా అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తూనే.. విలన్‌గా తన హవా కొనసాగిస్తున్నాడు కోలీవుడ్ నటుడు విజయ్‌సేతుపతి. ఇటీవలే విడుదలైన ఉప్పెన విజయం సాధించడంలో విజయ్‌సేతుపతి కీ రోల్ పోషించాడు. కృతిశెట్టి తండ్రి పాత్రలో విజయ్‌సేతుపతి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
 
ఎన్టీఆర్‌-త్రివిక్రమ్ కాంబోలో రెండోసారి వస్తున్న ఈ మూవీ అప్‌డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. విజయ్‌సేతుపతిని ప్రతినాయక పాత్రకు తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట.
 
డిఫరెంట్ విలన్ గా విజయ్ సేతుపతి అయితే బాగుంటుందని, తారక్‌కు మంచి పోటీనిస్తాడని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు టాక్‌. మాస్టర్, ఉప్పెన చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఒదిగిపోయిన విజయ్ సేతుపతి..రెండు సినిమాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచానడనంలో ఎలాంటి సందేహం లేదు. 
webdunia
ntr
 
మరి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే త్వరలో ఎన్టీఆర్-విజయ్‌సేతుపతి కాంబినేషన్‌ను తెరపై చూడొచ్చన్నమాట. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు తారక్‌. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వగానే త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్న యంగ్ టైగర్ ఎన్‌టీఆర్..?