Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rashmika Mandanna: రష్మికకు కాలు బెణికింది.. వీల్ ఛైర్‌‌పై నడవలేని స్థితిలో..? (video)

Advertiesment
Rashmika Mandanna

సెల్వి

, బుధవారం, 22 జనవరి 2025 (12:24 IST)
Rashmika Mandanna
పుష్ప2 హీరోయిన్ రష్మిక మందన్న కాలు బెణికింది. తాజాగా నడవలేని స్థితిలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో వీల్ ఛైర్‌లో ప్రత్యక్షమైంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు. 
 
తాజాగా రష్మిక తన కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. కారు దిగి ఆమె వీల్ చైర్‌లో కూర్చుని ఎయిర్ పోర్టు లోపలికి వచ్చింది. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. 
 
ఇకపోతే రష్మిక మందన్న ఛావా మూవీలో మహారాణిలా కన్పించనున్నారు. ఇటీవల ఏసుబాయ్ లుక్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. దీనిలో విక్కి కౌశాల్ హీరోగా శంభాజీ పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా.. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
 
జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న సమయలో కాలు బెణికిందని.. గాయం నుంచి కోలుకునేందుకు నెలల సమయం కూడా పట్టొచ్చేమో అని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో రష్మిక పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ