Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మావాడిదేముంది.. అంతా రాజమౌళి ఘనతే. తనవల్లే ప్రభాస్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్: కృష్ణంరాజు

మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి మరికొన్నేళ్ళు పడుతుందుకున్నా కానీ ‘బాహుబలి’తో ఇప్పుడే అది సాధ్యమైంది. దీంట్లో మా అబ్బాయి ప్రభాస్‌ సాధించిన దానికంటే రాజమౌళి ఘనత గొప్పది. కెప్టన్‌ ఈజ్‌ ఆల్‌వేస్‌ కెప్టెన్‌. కథను ఉపయోగించుకోవడ

Advertiesment
Baahubali-2
హైదరాబాద్ , శనివారం, 29 ఏప్రియల్ 2017 (08:20 IST)
మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి మరికొన్నేళ్ళు పడుతుందుకున్నా కానీ ‘బాహుబలి’తో ఇప్పుడే అది సాధ్యమైంది. దీంట్లో మా అబ్బాయి ప్రభాస్‌ సాధించిన దానికంటే  రాజమౌళి ఘనత గొప్పది. కెప్టన్‌ ఈజ్‌ ఆల్‌వేస్‌ కెప్టెన్‌. కథను ఉపయోగించుకోవడం కానీ , టెక్నిషియన్లను ఉపయోగించుకోవడం గానీ, సినిమాను గొప్ప లెవల్‌కు తీసుకెళ్ళడం డైరెక్టర్‌ గొప్పదనం అంటూ ప్రభాస్ పెదనాన్న, నటుడు కృష్ణంరాజు పేర్కొన్నారు.  రాజమౌళి మౌల్డ్‌ చేసిన పద్ధతి కానీ, ఫెర్మార్మెన్స్‌ రాబట్టుకున్న తీరుగానీ గొప్పవి. తనవల్లే ప్రభాస్‌ ఇప్పుడు ఇంటర్‌నేషనల్‌ ఆర్టిస్టు అయ్యాడు’’ అన్నారు.
 
మేం వంద సినిమాలు చేస్తే ఎన్ని గుర్తు ఉంటాయి నేను 200ల సినిమాలు చేశా. వాటిలో భక్తకన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం.. అలా కొన్ని గుర్తు ఉన్నాయి. సరిగ్గా 20 కూడా గుర్తుకు రావు. ప్రభాస్‌ ఇంకో 40 సినిమాలు చేసినా ఇలాంటి సినిమా వస్తుందని చెప్పలేం. ఒకటో, రెండో ఉంటాయేమో. అందుచేత ఎన్ని సినిమాలు చేశాం అని కాదు. ఎన్ని గొప్ప సినిమాలు చేశాం అనేదే ముఖ్యం. నాకు రాఘవేంద్రరావుగారు ఎలానో ప్రభాస్‌కు రాజమౌళి అలా అయ్యారు అన్నారు కృష్ణం రాజు
 
ఉప్పలపాటి వంశానికి ప్రభాస్‌ దేవుడిచ్చిన వరమని ప్రముఖ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల అన్నారు. బాహుబలి-2 సినిమా వీక్షించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... 'ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది నా మాట కాదు. ప్రపంచం అంతా ఒకటే మాట. అదే బాహుబలి. దర్శకుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. భూమిమీద సూర్యచంద్రులు ఉన్నంతకాలం బాహుబలి సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. అలాగే రాజమౌళి, ప్రభాస్‌ ఫ్యామీలి కూడా. ఉప్పలపాటి వంశానికి ప్రభాస్‌ గాడ్‌ గిఫ్ట్. వెరీ ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను' అని అన్నారు.

ఇంతకీ ప్రభాస్‌ పెళ్లెప్పుడు అనడిగితే – ‘‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నది ఇన్నాళ్లూ ఎలా సస్పెన్స్‌లా ఉండేదో.. ఇప్పుడు ప్రభాస్‌ పెళ్లి కూడా అంతే. ప్రస్తుతం మేం ‘బాహుబలి–2’ విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాం’’ అని శ్యామల సరదాగా అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాది రాష్ట్రాల్లో దుమ్ము రేపుతున్న బాహుబలి.. ఊగిపోతున్న ఉత్తరాది