Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దక్షిణాది రాష్ట్రాల్లో దుమ్ము రేపుతున్న బాహుబలి.. ఊగిపోతున్న ఉత్తరాది

తెలుగు రాష్ట్రాలతోపాటు మిగిలిన దిక్షిణాది రాష్ట్రాల్లోనూ బాహుబలి దుమ్మురేపుతున్నాడు. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో త్రివేండ్రం, చెన్నైల్లో సినీ ప్రేమికులు బాహుబలికి సాహో అంటున్నారు. ఇక బాహుబలి

Advertiesment
Bahubali 2
హైదరాబాద్ , శనివారం, 29 ఏప్రియల్ 2017 (08:00 IST)
తెలుగు రాష్ట్రాలతోపాటు మిగిలిన దిక్షిణాది రాష్ట్రాల్లోనూ బాహుబలి దుమ్మురేపుతున్నాడు. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో  త్రివేండ్రం, చెన్నైల్లో సినీ ప్రేమికులు బాహుబలికి సాహో అంటున్నారు. ఇక బాహుబలి ఫీవర్‌తో ఉత్తరాది ఊగిపోతోంది. ఖాన్‌ త్రయం సినిమాలకు మించిన క్రేజ్‌తో నార్త్‌లోనూ దుమ్మురేపుతోంది. మల్టీఫ్లెక్స్‌ల నుంచి మామూలు థియేటర్ల వరకూ ఎక్కడ చూసినా  బాహుబలి సందడే కనిపిస్తోంది.
 
తమిళనాడులో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 680 థియేటర్లలో బాహుబలి2 విడుదలైంది. తమిళనాడులో ఏ సినిమాకూడా ఇంతవరకు ఇన్ని థియేటర్లలో విడుదలైన చరిత్ర లేదు. సోమవారం రాత్రి వరకు అన్ని ఆటలకు టిక్కెట్లు అయిపోయాయని సమాచారం. అసాధారణం అనే పదం కూడా చిన్నబోయేంతగా సినిమా టిక్కెట్లు అమ్ముడైపోయాయని థియేటర్ల యజమానులు చెబుతున్నారు. ఈ సంవత్సరం అత్యుత్తమ ఓపెనింగ్ సాదించిన సినిమాగా బాహుబలి చరిత్ర సృష్టించింది. కొలివుడ్‌లో సూపర్ స్టార్ సినిమాకు కూడా ఇంత పెద్ద ఓపెనింగ్ రాలేదని వినికిడి. 
 
కేరళలో శుక్రవారం ఉదయం నుంచి 306 థియేటర్లలో బాహుబలి2 విడుదలైంది. అత్యద్భుతమైన రెస్పాన్స్‌తో థియేటర్లవద్ద మహిళలు, పిల్లలతో సహా అభిమానులు క్యూ కట్టారు. 
 
కర్నాటకలో 650 థియేటర్లలో బాహుబలి2 విడుదలైంది. సత్యరాజ్ వ్యాఖ్య వివాదంతో విడుదల అవుతుందా అని సందేహంలో పడ్డ కర్నాటకలో చిక్కుముడులు వీడిన తర్వాత ఆ రాష్ట్రంలోని థియేటర్లు జనంతో పోటెత్తుతున్నాయి. 
 
ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలి2 ఓపెనింగ్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్‌ను టైడల్ వేవ్, సునామి అనే పదాలతో వర్ణిస్తున్నారు. భారత చలనచిత్ర చరిత్రలో ఇంత పెద్ద భారీ ఓపెనింగ్స్ మునుపెన్నడూ లేదని ట్రేడ్ నిపుణులు స్పష్టం చేశారు.
 
బుక్ మై షో ఆన్ లైన్ టికెట్ విక్రయ సంస్థ ఇంతవరకు బాహుబలి 2  సినిమాకు సంబంధించి 33 లక్షల టిక్కెట్లను  అమ్మినట్లు చెప్పారు. ప్రతి సెకనుకూ 12 టిక్కెట్లు అమ్ముడవుతున్నట్లు బుక్ మై షో ప్రకటించింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ క్రేజే కనకవర్షం కురిపిస్తోంది... జిల్లా కలెక్టరుగా నయన