Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్' ప్రొడక్షన్ నెం.2 మూవీ లాంఛ్

Advertiesment
Vedansh Creative Works
, గురువారం, 10 డిశెంబరు 2020 (16:05 IST)
అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా గురువారం ఉదయం ముహూర్తమ్ షాట్‌తో మొదలైంది. 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్' సంస్థ ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఓ బ్యూటిఫుల్ ప్రేమకథగా ఈ సినిమాను దర్శకుడు ఏ సుశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. అర్జున్ దాస్యన్ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. చిత్ర కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు చిత్ర బృందం హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ, వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 2 మూవీని గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభించాం. ఇదొక అందమైన ప్రేమ కథ. నేటి నుంచి తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలుపెడుతున్నాం. జనవరిలో రెండో షెడ్యూల్, ఫిబ్రవరిలో మూడో షెడ్యూల్ పూర్తి చేయాలనుకుంటున్నాం. మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. 
 
హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ, మంచి లవ్ స్టోరీ ఎప్పుడు చేస్తారని నన్ను అడుగుతుంటారు. చాలా రోజుల తర్వాత క్లీన్ లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాను. తుంగభద్ర సినిమాలో సంగీత దర్శకుడు హరిగౌర, సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ గారితో పనిచేశాను. ఈ సినిమాతో మరోసారి వారితో కలిసి పనిచేస్తున్నాను. ఇవాళ్టి నుంచే షూటింగ్ ప్రారంభిస్తున్నాం. త్వరలోనే మీ ముందుకొస్తాం అన్నారు.
 
హీరో అర్జున్ సోమయాజులు మాట్లాడుతూ, వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ సంస్థలో నాకు హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎ సుశాంత్ రెడ్డి, నిర్మాత అర్జున్ దాస్యన్‌కు రుణపడివుంటాను. అరుణ్, మేఘాతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. 
 
దర్శకుడు ఎ సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు, మేఘా ఆకాష్ మెయిన్ లీడ్‌గా లవ్ స్టోరీ సినిమా ప్రారంభించాం. ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. ఫిబ్రవరి సెకండ్ వీక్ కల్లా సినిమా చిత్రీకరణ పూర్తి చేయబోతున్నట్టు చెప్పారు. 
 
ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - పీఎస్ వర్మ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వేళ అంతా చీకటిగానే అనిపిస్తుంది.. రేణూ దేశాయ్