Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం

Advertiesment
Varun Tej

డీవీ

, గురువారం, 20 జూన్ 2024 (17:21 IST)
Varun Tej
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అప్ కమింగ్ పాన్-ఇండియన్ మూవీ "మట్కా"తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ డా. విజయేందర్ రెడ్డి తీగల, SRT ఎంటర్టైన్మెంట్స్ రజనీ తాళ్లూరితో కలిసి నిర్మిస్తున్నారు.
 
ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గ్రాండ్ స్కేల్ లో రూపొందుతోంది. హ్యుజ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అద్భుతమైన నటీనటులు, టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. "మట్కా" తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మ్యాసీవ్ సెట్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
 
ఈ లెన్తీ 40-రోజుల ముఖ్యమైన షెడ్యూల్ కోసం RFCలో మ్యాసీవ్ సెట్‌ను నిర్మించారు, ఇందులో యూనిట్ చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి ఈ షెడ్యూల్‌లో పార్ట్ అయ్యారు.
 
"మట్కా" దేశం అంతటా సెన్సేషన్ క్రియేట్ చేసిన నిజ జీవిత సంఘటన స్పూర్తితో డిఫరెంట్ టైం లైన్స్ లో రూపొందుతోంది. క్యారెక్టర్ పట్ల వరుణ్ తేజ్ చాలా డెడికెటెడ్ గా వున్నారు. ఇందులో నాలుగు డిఫరెంట్ అవతార్ లో కనిపిస్తారు.
 
మెయిన్ కాస్ట్ లో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి. రవి శంకర్ ఉన్నారు. మట్కా భాషాపరమైన హద్దులు దాటిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
 
"మట్కా"కి సినిమాటోగ్రఫీ ఎ. కిషోర్ కుమార్ అందిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎడిటింగ్‌ను కార్తీక శ్రీనివాస్ ఆర్ హ్యాండిల్ చేస్తున్నారు.  
 
ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్ తో పాటు నిజ జీవితంలోని సంఘటనలు, హ్యూమన్ ఎమోషన్స్ చాలా అద్భుతంగా వుండబోతున్నాయి.
 
నటీనటులు: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్