Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థుల‌కు శృంగార పాఠాలు చెప్పిన వ‌ర్మ‌

Advertiesment
Ram Gopal Varma,  Naina Ganguly, Apsara Rani
, మంగళవారం, 3 మే 2022 (17:02 IST)
Ram Gopal Varma, Naina Ganguly, Apsara Rani
మా ఇష్టం (డేంజరస్) చిత్రాన్ని మే 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ చేపట్టిన ఆర్జీవీ.. ఆస్క్ ఎనీథింగ్ అనే కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, చిత్రంలో లీడ్ రోల్స్ పోషించిన నైనా గంగూలీ, అప్సర రాణి పాలొన్నారు. లెస్బియన్ శృంగారం విషయమై పలువురు స్టూడెంట్స్, రాముయిజం ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు వర్మ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఈ సినిమా ఓ డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని ఆయన చెప్పారు.
 
ఇది మహిళల మధ్య సాగే ఘాటు ప్రేమ కథ. స్త్రీ, పురుషుని మధ్య ప్రేమ, లైంగిక వాంఛ ఎలా అయితే ఉంటాయో వీరి మధ్య కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ప్రేమ అనేది ప్రేమ మాత్రమే. దానికి లింగబేధంతో ఎలాంటి సంబంధం లేదు అని పేర్కొంటూ వదిలిన 'మా ఇష్టం' ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారు ప్రమాదానికి గురైన నటి తనుశ్రీ దత్తా