రామ్‌గోపాల్ వర్మ ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేస్తున్నట్లు చెప్పాడు. దాని సంగతి ఏమోగాని ఇప్పుడు మరోసారి సినిమా చేయబోతున్నాడు. ఇది వై.ఎస్.జగన్, భారతిల రియల్ పిక్ అంటూ కొత్త స్టేట్ మెంట్ ఇచ్చాడు.
నేను అతి త్వరలో వ్యూహం అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్‌లో అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.. అంటూ రామ్‌గోపాల్ వర్మ ఇటీవల ఓ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వ్యూహం అనే టైటిల్ ఖరారు చేశారు.
ఇందులో జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస నటించనున్నారు. అహంకారానికి ఆలోచనకు మఽధ్య జరిగే యుద్ధం ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. త్వరలో ఇతర వివరాలను ప్రకటిస్తారు.