కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజా చిత్రం వలిమై చిత్రం నుంచి టీజర్ రిలీజైంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వలిమై 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
ఈ చిత్రంలో కార్తికేయ గుమ్మకొండ, హుమా ఖురేషి, యోగి బాబు, రాజ్ అయ్యప్ప, సుమిత్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. మేకర్స్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.
ట్రైలర్‌లో హాలీవుడ్‌ను తలదన్నే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. బాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అలాగే విలన్‌గా కార్తికేయ లుక్ అదిరిపోయాయి. మూడు నిముషాలు సాగిన ఈ ట్రైలర్ లోని ప్రతి సన్నివేశం, ప్రతి బిట్ సినిమాపై ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.