Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళ్యాణ్‌జీ గోగన తెరకెక్కించిన మారియో నుంచి వాలెంటైన్స్ డే పోస్టర్

Advertiesment
Mario poster

దేవి

, శనివారం, 15 ఫిబ్రవరి 2025 (15:37 IST)
Mario poster
నాటకం, తీస్ మార్ ఖాన్ వంటి చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్‌జీ గోగన తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు కళ్యాణ్ జీ గోగన మరో కొత్త కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ నిర్మాతగా.. కళ్యాణ్‌జీ గోగన తెరకెక్కిస్తున్న చిత్రం ‘మారియో’. అనిరుధ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీలో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
 
వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. చూస్తుంటే ఇదేదో అడ్వెంచరస్ చిత్రంలానే ఉంది. ఫన్ రైడ్ అంటూ క్యాప్షన్ పెట్టడంతో ఇందులో కావాల్సినంత వినోదం ఉంటుందని అర్థం అవుతోంది. కామిక్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. కథా రచనలో, మాటలు అందిచండంలో కళ్యాణ్‌జీ గోగనకి రాకెందు మౌళి సహకరించారు.
 
ప్రస్తుతం కామెడీ, థ్రిల్లర్ మిక్స్ చేసి భిన్న రకాల చిత్రాలతో, కొత్త కంటెంట్‌తో మేకర్లు ప్రయత్నం చేస్తున్నారు. కళ్యాణ్‌జీ గోగన ప్రస్తుతం మారియో అంటూ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు వస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే మిగతా వివరాలన్ని ప్రకటించనున్నారు.
 నటీనటులు : అనిరుధ్, హెబ్బా పటేల్, రాకెందు మౌళి, మౌర్య సిద్దవరం, యష్న, కల్పిక, మదీ, లతా రెడ్డి తదితరులు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nandamuri Balakrishna: థమన్‌కు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ (video)