Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభాస్ ను ప్రాజెక్ట్ K తో ఉలగనాయగన్ కమల్ హాసన్ గట్టెక్కిస్తాడా !

Kamal-prabhas
, సోమవారం, 26 జూన్ 2023 (10:39 IST)
Kamal-prabhas
ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ K' అనౌన్స్ చేసినప్పటి నుంచి హెడ్ లైన్స్ లో నిలుస్తుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు సినిమా బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉలగనాయగన్ కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. కమల్ హాసన్ 'ప్రాజెక్ట్ కె'లో చేరడంతో ఇండియన్ సినిమాలో గ్రేటెస్ట్ స్టార్ కాస్ట్ వున్న చిత్రంగా 'ప్రాజెక్ట్ కె' నిలిచింది.
 
కాగా, ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తిఅయింది. షడన్ గా కమల్ పేరు రావడం తెలుగు పరిశ్రమలో ఆసక్తిగా మారింది. ప్రభాస్ కు బాహుబలి తర్వాత ఎటువంటి సక్సెస్ లేదు. పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ కూడా ఒకరకంగా ఫెయిల్ అని చెప్పాలి. ఇంకా ప్రభాస్ చేతిలో సినిమాలు ఉన్నాయి. సాలార్ పై కూడా పెద్దగా ఆసక్తి లేదు. కానీ నాగ్ అశ్విన్ అనగానే క్రేజ్ వచ్చింది. ఇక అమితాబ్ ఉన్న ఆయన పాత్ర పెద్ద తరహాగా ఉంటుంది. అందుకే ప్రభాస్ కు హిట్, తనకు హిట్ రావాలంటే ఇంకో హీరో కావాలని కమల్ ను తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. 
 
ఇప్పటికే కమల్ తనకు హిట్ కోసం చాలా కస్టపడి విక్రమ్ సినిమాలో హీరో సూర్యని ఎంచుకుని హిట్ కొట్టాడు. సూర్య ఉండపట్టే ఆ సినిమాకు క్రేజ్ వచ్చింది అనేది తెలిసిందే. అందులోనూ విజసేతుపతి కూడా ఉన్నాడు. అదే బాటలో ప్రభాస్ కొట్టాలని చూస్తున్నాడని సమాచారం. సైన్స్ నేపధ్యం కథ కనుక కమల్ పాత్ర కూడా ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవితమే ఓ సర్కిల్ అనే పాయింట్ నచ్చి నటించాం: అర్షిణ్‌ మెహతా,రిచా పనై