Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గద్దర్‌ కీలకపాత్ర పోషించిన ఉక్కు సత్యాగ్రహం

satyareddy, Gaddar
, బుధవారం, 21 జూన్ 2023 (16:00 IST)
satyareddy, Gaddar
గతంలో సర్దార్ చిన్నపరెడ్డి, అయ్యప్ప దీక్ష, రంగులకళ,సిద్ధం,కుర్రకారు,ప్రత్యూష,టీ నగర్(తమిళ్) శంకర్ దాదా జిందాబాద్ హీరోయిన్ కరిష్మా కోటక్ తో గ్లామర్, ప్రశ్నిస్తా వంటి హిట్ చిత్రాలతో కలిపి మొత్తం 52 చిత్రాలకు పైగా నిర్మించిన సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణ,దర్శకత్వంలో  తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తుంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది.
 
ఈ చిత్రంలొప్రజాగాయకుడు గద్దర్‌ కీలకపాత్ర పోషించారు. ఈచిత్రం ద్వారా గాజువాక పల్సర్‌ బైక్‌ ఝాన్సీ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. వైజాగ్‌ ఎంపీ ఎం.వి.వి.సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ,మేఘన, స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులు అయోధ్య రామ్,ఆదినారాయణ, వెంకట్రావు,ప్రసన్న కుమార్,కేయస్ఎన్ రావ్,మీరా,పల్నాడు  శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి,హనుమయ్య,అప్పికొండ అప్పారావ్, బాబాన్న,సింగ్ తదితరులు కీలకపాత్రలుపోషించారు. ఈ సినిమాగురించి హీరో- దర్శకనిర్మాత సత్యారెడ్డిమాట్లాడుతూ ఆనాడు ‘‘స్టీల్‌ప్లాంట్‌ సాధన కోసం జరిగిన పోరాటం,ఈనాడు పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాల ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది అన్నారు. 
 
స్టీల్‌ ప్లాంట్‌  యూనియన్‌ లీడర్లు, ఉద్యోగులు, భూనిర్వాసితులు  ఈ చిత్రంలో నటించటం ఒక విశేషం. రియాలిటీకి దగ్గరగా యువతరాన్ని ఆలోచింప చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. గద్దర్‌, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ,సత్యారెడ్డి, మజ్జి దేవిశ్రీ అద్భుతమైన పాటలు రాశారు. శ్రీకోటి సంగీతం హైలైట్‌గా ఉంటుంది. త్వరలో ఆర్‌కె బీచ్‌లో  ప్రీ రిలీజ్‌ వేడుకలు నిర్వహిస్తామన్నారు.ప్రముఖ వ్యక్తి ఈ వేడుకకు ముఖ్య అతిథిగాహాజరవుతారు" అని అన్నారు.
సాంకేతిక నిపుణులు
 
కథ,స్క్రీన్,ప్లే,మాటలు, నిర్మాత, దర్శకత్వం సత్యారెడ్డిమ్యూజిక్ డైరెక్టర్ :-శ్రీ  కోటి,ఎడిటర్: మేనగ శ్రీను సినిమాటోగ్రఫీ: వెంకట్ చక్రి,కోరియో గ్రఫీ :నందు,నాగరాజు,కో డైరెక్టర్ పవన్ బాబు  రంగనాధ్,సమర్పణ సతీష్ రెడ్డి,శ్రీవేమల సహ నిర్మాతలు శంకర్ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదిపురుష్ కోసం పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఏమి చేసాడో తెలుసా..