Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్న మహేష్ బాబు?

Advertiesment
త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్న మహేష్ బాబు?
, మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (19:23 IST)
సూపర్‌స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. ఇందులో మొదటిది అతడు. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత ఖలేజా సినిమా వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది, అయితే బుల్లితెరపై మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
ఖలేజా తరువాత ఈ ఇద్దరు కలిసి పనిచేయలేదు. త్రివిక్రమ్ అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్‌తో సినిమాలు చేసాడు. ఇంతకాలం తర్వాత మళ్లీ త్రివిక్రమ్ మహేష్‌తో కలసి పనిచేయబోతున్నాడు. అయితే ఇది సినిమా కోసం కాదు.. ఓ యాడ్ ఫిలిం కోసమే.
 
ఓ యాప్‌కు సంబంధించి రూపొందించే యాడ్ చేయడానికి త్రివిక్రమ్‌కు అవకాశం వచ్చింది. మంచి డీల్ కావడంతో.. మహేష్‌తో యాడ్ చేసేందుకు వెంటనే ఓకే చెప్పేశారట. ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ పనికి రెండు రోజుల గ్యాప్ ఇచ్చి మరీ ఈ యాడ్ ఫిల్మ్ చేయబోతున్నారట. ఏప్రిల్ 10న ఈ యాడ్ షూట్ ఉంటుందని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే స్కూటర్‌పై చరణ్, ఎన్టీఆర్..