Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజినీసార్ కోసం బరువు పెరిగాను.. ఇక ఆయనిష్టం.. త్రిష

దాదాపు ద‌శాబ్దం పాటు తెలుగు, త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో అగ్ర క‌థానాయిక‌గా వెలుగొందన హీరోయిన్ చెన్నైచంద్రం త్రిష. వ‌యసు 35 సంవ‌త్స‌రాలు దాటినా.. ఇప్ప‌టికీ అవ‌కాశాలు అందుకుంటూ హీరోయిన్‌గా కెరీర్ కొన‌సాగి

Advertiesment
Trisha
, సోమవారం, 1 అక్టోబరు 2018 (16:11 IST)
దాదాపు ద‌శాబ్దం పాటు తెలుగు, త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో అగ్ర క‌థానాయిక‌గా వెలుగొందిన హీరోయిన్ చెన్నైచంద్రం త్రిష. వ‌యసు 35 సంవ‌త్స‌రాలు దాటినా.. ఇప్ప‌టికీ అవ‌కాశాలు అందుకుంటూ హీరోయిన్‌గా కెరీర్ కొన‌సాగిస్తోంది. త‌మిళ‌, తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో దాదాపు అంద‌రు అగ్ర హీరోల‌తో న‌టించిన త్రిష.. ఇప్ప‌టివ‌ర‌కు సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ స‌ర‌స‌న న‌టించ‌లేదు. తాజాగా ఆ అవ‌కాశం కూడా త్రిష‌కు ద‌క్కింది. ర‌జినీ హీరోగా తెర‌కెక్కుతున్న 'పేట్ట' సినిమాలో త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా ఆమె విజ‌య్ సేతుప‌తితో క‌లిసి న‌టించిన '96' విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోంది.
 
1996లో ప్లస్‌టూ చదివిన విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసినప్పటి కథతో యువ దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే చిత్రబృందం ప్రచారం ముమ్మరం చేసింది. 
 
ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా త్రిషా మాట్లాడుతూ, 'రజనీ సార్‌తో, విజయ్‌ సేతుపతితో కలిసి నటించాలన్న నా కోరిక తీరింది. తర్వాత రౌండ్‌కు నేను సిద్ధంగా ఉన్నాను. 'పేట్ట' సినిమా కోసం కొంచెం బరువు పెరిగాను. హెయిర్‌స్టైయిల్‌ కూడా మార్చుకున్నాను. పెద్ద సూపర్‌స్టార్‌ అన్న అహంకారం ఇసుమంత కూడా లేని గొప్ప నటుడు రజనీ సార్‌. మీతో కలిసి నటించడం నా కల అని చెబితే... గలగలా నవ్వారు. ఇకపోతే జయలలిత పాత్రలో నటించాలని ఆశపడ్డాను. కానీ, మరో హీరోయిన్‌ నటిస్తున్నట్టు తెలిసింది. అలాగని నాకేం బాధ లేదు' అని చెప్పుకొచ్చింది. 
 
ఇక తన పెళ్లి గురించి స్పందిస్తూ, పెళ్లి గురించి ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని, అలాగే తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదని, బాయ్‌ఫ్రెండ్‌ కూడా లేడని చెప్పింది. శబరిమల ఆలయంలో మహిళ ప్రవేశంపై సుప్రీం తీర్పు గురించి ప్రస్తావిస్తూ... ఇది మహిళలకు దక్కిన గౌరవంగా త్రిష పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అరవింద సమేత' ప్రీ రిలీజ్‌ వేడుకకు అంతా సిద్ధం.. తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్...