Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరు సినిమాతో రూ.14 లక్షలు నష్టం వస్తే వెంకటేష్ చిత్రంతో లాభాల పంట...

చిరు సినిమాతో రూ.14 లక్షలు నష్టం వస్తే వెంకటేష్ చిత్రంతో లాభాల పంట...
, సోమవారం, 15 అక్టోబరు 2018 (10:49 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నకోణాలను ఆవిష్కరింపజేసే నటీనటుల్లో అశోక్ కుమార్ ఒకరు. ఈయన మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు మేనల్లుడు. ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, నటుడిగా... సినీరంగంలో అనేక పాత్రలు పోషించారు. ముఖ్యంగా, అశోక్‌కుమార్‌ పేరు వినగానే "ఒసేయ్‌ రాములమ్మ"లో దొర గుర్తుకొస్తాడు. తెరపై డిఫరెంట్‌ విలనిజాన్ని పండించిన ఆయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.
 
అలాంటి అశోక్ కుమార్ తాజాగా ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ, తాను కాలేజీ చదివే రోజుల్లోనే వ్యాపారంపైన ఆసక్తి ఉండేది. అప్పుడే సినిమాలు తీసుకోవడం, ఎగ్జిబిటర్‌గా చేశాను. తర్వాత డిస్ట్రిబ్యూటర్‌ అయ్యాను. ఆ తర్వాత ప్రొడ్యూసర్‌ అయ్యాను. అలా వచ్చాను సినీ ఇండస్ట్రీకి. థియేటర్‌ను నాలుగేళ్లు సక్సెస్‌ఫుల్‌గా నడిపించాను. 
 
డిస్ట్రిబ్యూటర్‌గా మారిన తర్వాత రామానాయుడుని కలిసి తనకు సినిమా ఇవ్వమని అడిగాను. ఆయనకు ఇవ్వడం ఇష్టంలేదు. దీంతో ఆయనపై చిన్న కోపం ఉండేది. అదే టైంలో రెండు సినిమాలు వేరేవి తీసుకున్నాను. అవి బాగా సక్సెస్‌ అయ్యాయి. అప్పుడు బాలకృష్ణ మార్కెట్‌ మూడున్నర లక్షలుండేది ఒక్కో జిల్లాకు. నేను వెళ్లి అడిగితే ఐదన్నాడు. సరే అని ఓ వారం తర్వాత డబ్బులు పట్టుకుని వెళితే ఆరున్నర అన్నాడు. ఆ తర్వాత ఏడు, తొమ్మిది అన్నాడు. నాకు కోపం వచ్చింది. 
 
ఆసమయంలోనే ఎన్టీఆర్‌ 'వీరబ్రహ్మేంద్రస్వామిచరిత్ర' సినిమా వచ్చింది. కోపంలో ఆ సినిమా కొన్నాను. ఒక్క జిల్లాకు 23 లక్షలు. చాలా పెద్ద అమౌంట్‌. నాయుడుగారికి షాక్‌. అంత రేటు పెట్టి ఎలా కొన్నాడు అని. ఆ సినిమాకు మినిమమ్‌ లాభంతో బయటపడ్డాను. ఆ తరువాత నాయుడుగారు యాక్సెప్ట్‌ చేశారు. ఆ నెక్ట్స్‌ ఒకేవారంలో మూడు సినిమాలు కొన్నాను. టోటల్‌ లాస్‌. చిరంజీవి 'చంటబ్బాయి'తో రూ.14 లక్షలు పోయింది. ఆ తర్వాత కుదురుకుని వెంకటేష్‌తో 'రక్తతిలకం' సినిమా చేశాను. సినిమా బాగా కలెక్ట్‌ చేసింది. ఆ తర్వాత ఆర్నెల్లకే మళ్లీ వెంకటేశ్‌తో 'ధృవనక్షత్రం' చేశాను. ఆ సినిమా బాగా హిట్టయి లాభాల పంట పడించిందని అశోక్ కుమార్ వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖంపై ముద్దులు పెడుతూ రాక్ష‌సానందం పొందాడు.. సింగర్ సునీత