Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దర్శక మేరునగధీరుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు

Advertiesment
Happy Birthday Rajamouli
, బుధవారం, 10 అక్టోబరు 2018 (12:24 IST)
టాలీవుడ్ దర్శకమేరునగధీరుడు ఎస్ఎస్. రాజమౌళి. తెలుగు జాతి గర్వించదగ్గ దర్శకుడు. ఆయన బుధవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు, హీరోయిన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
 
కాగా, 'స్టూడెంట్ నం.1' నుంచి అపజయమెరుగని వరుస విజయాలు. 'సింహాద్రి', 'సై', 'ఛత్రపతి', 'విక్రమార్కుడు', 'యమదొంగ', 'మగధీర', 'మర్యాద రామన్న', 'ఈగ'.. వంటి ఎన్నో ఒకదానితో ఒకటి సంబంధంలేని చిత్రాలు... దర్శకధీరుడిగా రాజమౌళిని నిలబెట్టాయి. అపజయమెరుగని జైత్రయాత్ర.. "బాహుబలి" అనే మహా యజ్ఞానికి చేరుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీని "బాహుబలి"కి ముందు.. "బాహుబలి"కి తర్వాత అనేలా చేశాయి.
 
ఆయన తీసిన "బాహుబలి" పార్ట్-1, పార్ట్-2 చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి అద్భుత సక్సెస్‌ను సాధించి ఒకదాని రికార్డును మరొకటి బీట్ చేసింది. దర్శకుడిగా రాజమౌళి రేంజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. అలాంటి రాజమౌళి నేడు(బుధవారం) రాజమౌళి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స‌వ్య‌సాచి ఫ‌స్ట్ సాంగ్ అదిరిందిగా... సినిమా ఎలా వుంటుందో?