టాలీవుడ్ హీరోయిన్లలో అవికా గోర్ ఒకరు. "చిన్నారి పెళ్లి కూతురు" అనే టీవీ సీరియల్ ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఆ తర్వాత వెండితెరపై అరంగేట్రం చేసింది. తెలుగులో ఆమె తొలి చిత్రం 'ఉయ్యాలా జంపాల'. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
ఆ తర్వాత ఆమె పలు చిత్రాల్లో నటించింది. అలాంటి వాటిల్లో 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్తా మావ', 'తను నేను', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి చిత్రాలలో నటించింది. చివరిగా 2019లో "రాజు గారి గది 3" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత అవికా కొంత గ్యాప్ తీసుకున్న అవికా అందరిని ఆశ్చర్యపరిచేలా సరికొత్త లుక్‌లోకి మారింది.
తాజాగా తన ప్రియుడిని పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే పెళ్లి ఇప్పట్లో చేసుకోమని అంటున్న అవికా.. ప్రేమ, జీవితం అందమైన అనుభవంలా ఉందంటూ కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది. ఇవి అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇక అవికా ప్రియుడు పేరు మిలింద్ చద్వానీ కాగా, తనపై ఉన్న ప్రేమని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వ్యక్తం చేసింది. నా ప్రార్థనలకు ఫలితం దొరికింది. మనకు నచ్చిన వ్యక్తి దొరకడం కష్టం అనుకున్నా కాని, అలాంటి వ్యక్తి దొరికేశాడు. ఇది కలలా ఉంది. ఈ బంధం నా జీవితంలో కీలక పాత్ర కానుందని అవికా గోర్ చెప్పుకొచ్చింది.