Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రముఖ దర్శకుడు కె.ఎస్.నాగేశ్వర రావు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కె.ఎస్.నాగేశ్వర రావు కన్నుమూత
, శనివారం, 27 నవంబరు 2021 (10:18 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం ఘటన జరిగింది. ప్రముఖ దర్శకుడు కె.ఎస్.నాగేశ్వర రావు కన్నుమూశారు. అనారోగ్య కారణంగా ఆయన శనివారం మృతి చెందారు. ఆయన్ను హైదరాబాద్ నగరానికి తీసుకొస్తుండగా ప్రాణాలు విడిచారు. ఈయన మరణంపై ఆయన కుమారుడు మాట్లాడుతూ, అనారోగ్యానికి గురైన తన తండ్రిని ఆస్పత్రిలో చూపించేందుకు హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా మార్గమధ్యంలో ఫిట్స్ రావడంతో ఆయన చనిపోయారని చెప్పారు. 

 
కాగా, ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ దర్శకుడు మరణ వార్త తెలుసుకున్న సినీ సెలెబ్రిటీలు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ.. పోలీస్, దేవా, సాంబయ్య చిత్రాలను రూపొందించి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు కె.ఎస్ నాగేశ్వరరావు.. ఆతర్వాత శ్రీశైలం, లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో  వైజయంతి చిత్రాలను రూపొందించి మాస్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న కె.ఎస్ నాగేశ్వరరావు రీసెంట్‌గా 'బిచ్చగాడా మజాకా' చిత్రాన్ని తెరకెక్కించారు.

 
గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధించిన వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.. నిన్న నవంబర్ 26న ఏలూరు నుండి తిరిగి వస్తూ.. ఫిట్స్ వచ్చి అకస్మాత్‌గా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను దగ్గరలో వున్న హాస్పటల్‌కు హుటాహుటిన తరలించారు. చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం సాయంత్రం మృతి చెందారు.. శనివారం ఆయన స్వస్థలం అయిన కోయిలగుడేం దగ్గరలో వున్న పోతవరంలో నేడు ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢీ-13 విన్నర్ ఎవరో... స్టెలిష్ స్టార్ చెప్పేసారుగా.. వీడియో లీక్