Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఇంద్రధనుస్సు' చిత్ర దర్శకుడు కట్టా రంగారావు కన్నుమూత

Advertiesment
'ఇంద్రధనుస్సు' చిత్ర దర్శకుడు కట్టా రంగారావు కన్నుమూత
, సోమవారం, 14 జనవరి 2019 (12:03 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శకుడు కట్టా రంగారావు కన్నుమూశాడు. 'ఇంద్రధనస్సు' చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. నిజానికి కమ్యూనిస్టు కుటుంబనేపథ్యం నుంచి చిత్రసీమలోకి అడుగుపెట్టిన రంగారావు.. తన సినీ కెరీర్ ఆరంభంలో విప్లవ భావజాలం ఉన్న చిత్రాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నాడు. 
 
ఆ తర్వాత 'ఆఖరి క్షణం', 'ఉద్యమం', 'అలెగ్జాండర్', 'నమస్తే అన్నా', 'బొబ్బిలి బుల్లోడు', 'వారెవ్వా మొగుడా', 'చెప్పుకోండి చూద్దాం' వంటి చిత్రాలను తీశారు. అంతేకాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమకు అనేక మందిని పరిచయం చేశారు. ఇలాంటివారిలో శుద్దాల అశోక్ తెజ, ఎమ్మెస్ నారాయణ, రమేష్ అరవింద్, వడ్డేపల్లి శ్రీనివాస్, గురుచరణ్ వంటి వారు ఉన్నారు. ఈయన తెలుగు సినీ దర్శకుల సంఘానికి కార్యదర్శిగా, సభ్యుడుగా, జాయింట్ సెక్రటరీగా, ఈసీ మెంబర్‌గా కూడా పని చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుష్క, షాలినీ పాండే, అంజలి, మాధవన్ కాంబోలో సినిమా