టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రాం పేజీలో తెలిపారు. తను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎలా తగులుకుందో కరోనా నన్ను పట్టుకుందని వెల్లడించింది.
ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు హోం ఐసొలేషన్లో వున్నాననీ, దయచేసి అందరూ మాస్కులు ధరించాలని అభ్యర్థిస్తోంది. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
కాగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ప్రిన్స్ మహేష్ బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్, రాజేంద్ర ప్రసాద్.. తదితరులు కరోనా బారిన పడినవారిలో వున్నారు.