Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టైగర్ నాగేశ్వరరావు నుంచి మ్యాసియస్ట్ సాంగ్ వీడు విడుదల

Advertiesment
Nageswara Rao style
, శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (09:31 IST)
Nageswara Rao style
పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ మాస్ మహారాజా రవితేజ పాత్రను పరిచయం చేయగా, ట్రైలర్ మనల్ని అతిపెద్ద గజదొంగ వరల్డ్ కి తీసుకెళ్లింది. ఫస్ట్ సింగిల్ ఏక్ దమ్ రొమాంటిక్ సైడ్ చూపించింది. ఇప్పుడు విడుదలైన సెకెండ్ సింగిల్ వీడు టైగర్ పాత్రను వివరిస్తోంది.
 
జివి ప్రకాష్ కుమార్ పవర్ ఫుల్ బీట్‌లతో కూడిన మ్యాసియస్ట్ పాటను స్కోర్ చేశారు.ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసిన లిరిక్స్  లార్జర్ దేన్ లైఫ్ గా మాస్ ని ఆకట్టుకునేలా వున్నాయి. సింగర్ అనురాగ్ కులకర్ణి తన పవర్ ఫుల్ వాయిస్ పాటకు మరింత ఎనర్జీ జోడించారు.
 
విజువల్స్ టాప్ క్లాస్ గా ఉన్నాయి. ఫైర్ ఎఫెక్ట్స్, రావిష్ మేకింగ్, గ్రే టోన్ ఇంటెన్స్ ని రెట్టింపు చేశాయి. లిరికల్ వీడియోను బట్టి చూస్తే, రవితేజ కనికరం లేని గజదొంగ నటించారని, ఎవరైనా తన దారికి అడ్డువస్తే వదిలిపెట్టరని స్పష్టమవుతోంది. దర్శకుడు వంశీ మ్యాసియస్ట్ అవతార్‌ లో పాత్రను ప్రెజెంట్ చేశాడు. రవితేజను ఇలాంటి ఫెరోషియస్  పాత్రలో చూడటం అభిమానులకు పండగ. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు తమ బలమైన హావభావాలతో రవితేజ పాత్రకు మరింత ఎలివేషన్ ఇచ్చారు. ఈ పాట మాస్‌ని కట్టిపడేస్తుంది. పూర్తి విజువల్స్‌తో పాటను బిగ్ స్క్రీన్ పై చూసినప్పుడు మరింత జోష్‌ను ఇస్తుంది.
 
ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ను వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాలను రూపొందించిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.
 
దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీక్వెల్ కు ట్విస్ట్ ఇచ్చిన అష్టదిగ్భంధనం మూవీ - రివ్యూ