రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ఈనెల 20న విడుదలకాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి భారీ ప్రమోషన్ జరుగుతున్నాయి. కేంద్రమంత్రి కూడా ఈ సినిమా గురించి కితాబిచ్చారు. ఇప్పటికే ఈ సినిమా గురించి బుకింగ్ ప్రారంభమయ్యాయి. టోటల్ షోస్ 140. గ్రాస్ 35 లక్షలు, బుకింగ్ 27శాతం అయింది. ఒక్కరోజుకే ఇలా వుంది. ఇంకా మూడు రోజుల వ్యవధి వుంది. దానితోపాటు ఒక్కరోజు ముందు బాలకృష్ణ భగవంత్ కేసరి రాబోతుంది. ఈ సినిమా ఇప్పటికే క్రేజ్ ఏర్పడింది.
అయితే టైగర్ నాగేశ్వరరావు అనేది స్టువర్డ్పురం దొంగలనాయకుడు. ఆయనపై సినిమాలు పలువురు కూడా గతంలో చేశారు. ఇంతకుముందు దొంగోడు, స్టూవర్ట్‌పురం దొంగలు చిరంజీవి చేశారు. కానీ ఏదీ ఆడలేదు. కానీ సీనియర్ దర్శకుడు సాగర్ చేసిన సూవర్ట్పురం అనే సినిమా ఆయనకు మంచి హిట్ ఇచ్చింది. అందుకే మరోసారి టైగర్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ రవితేజ సినిమా అనేది పూర్తిగా ఎవ్వరూ ఊహించని విధంగా ఒరిజినల్‌గా వారి కుటుంబీకులను కలిసి రాసిన కథ అని దర్శకుడు వంశీ తెలియజేస్తున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలకాబోతుంది. ఇందులో టైగర్ సాహసాలు, విన్యాసాలు, యాక్షన్ ఎపిసోడ్స్ హైటైల్గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇటీవలే సెన్సార్ చేసిన ఆఫీసర్ ఈ సినిమాపై అభినందలు కురిపిస్తూ కొన్ని సీన్స్ కుదించారని తెలిసింది. మరి అవి ఈ సినిమాకు లింక్ కు సంబంధంలేదని తెలుస్తోంది. దాదాపు ఈ సినిమా మూడు గంటల నిడివి వుంటుందని తెలుస్తోంది.