Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్ గ్రేడింగ్ చూసి థ్రిల్ అయ్యా : SS రాజమౌళి

Advertiesment
SS Rajamouli

డీవీ

, శుక్రవారం, 10 జనవరి 2025 (12:51 IST)
SS Rajamouli
అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా & హోమ్ కోసం భారతదేశంలో మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్‌ప్రొడక్షన్ ఫెసిలిటీ ప్రారంభించడం ద్వారా మళ్ళీ చరిత్ర సృష్టించింది, దీనిని దర్శకధీరుడు SS రాజమౌళి, అన్నపూర్ణ స్టూడియోస్ వైస్ చైర్మన్, అగ్ర హీరో నాగార్జున అక్కినేని సమక్షంలో  లాంచ్ చేశారు
 
డాల్బీతో కలిసి ప్రారంభించబడిన ఈ అత్యాధునిక సౌకర్యం, భారతీయ చలనచిత్ర నిర్మాణం ఆడియో-విజువల్ ప్రమాణాలను రీడిఫైన్ చేయడం, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సినిమా ఎక్స్ పీరియన్స్ అందించే లక్ష్యంగా పెట్టుకుంది.
 
అకాడమీ అవార్డు గెలుచుకున్న రాజమౌళి RRR - స్పెషల్ ఫుటేజ్ కూడా ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ప్రదర్శించారు - డాల్బీ సినిమాలో విడుదలైన మొట్టమొదటి భారతీయ చిత్రం, ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఒక మైలురాయి క్షణంగా మారింది.
 
దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ...RRR సమయంలో, మేము సినిమాను డాల్బీ విజన్‌లో గ్రేడ్ చేయాలనుకున్నప్పుడు, మేము జర్మనీ వరకు ప్రయాణించాల్సి వచ్చింది. మన దేశంలోనే డాల్బీ విజన్‌లో నా సినిమాను ఎక్స్ పీరియన్స్ చేయలేకపోవడం కొంచెం నిరుత్సాహపరిచింది. కానీ ఈరోజు, అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్ గ్రేడింగ్ సౌకర్యాన్ని చూసి నేను చాలా థ్రిల్ అయ్యాను. నా తదుపరి సినిమా విడుదలయ్యే సమయానికి, భారతదేశం అంతటా మల్టీ డాల్బీ సినిమా ఉంటుంది అనేది మరింత గొప్ప విషయం. డాల్బీ విజన్‌లో సినిమా చూడటం పూర్తిగా భిన్నమైన అనుభవం - స్పష్టత, ప్రతి ఫ్రేమ్‌లోని సూక్ష్మ నైపుణ్యాలను పెంచే విధానం కథను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళుతుంది. ప్రేక్షకులు దానిని ఎక్స్ పీరియన్స్ చేయడం థ్రిల్లింగ్ గా వుంది'అన్నారు.
 
అన్నపూర్ణ స్టూడియోస్ వైస్ చైర్మన్ అగ్ర హీరో నాగార్జున అక్కినేని, భారతీయ సినిమా ఆవిష్కరణలలో స్టూడియో ఎలా ముందంజలో ఉందో చెప్పారు. "వర్చువల్ ప్రొడక్షన్‌లో అగ్రగామిగా ఉండటం నుండి దేశంలో మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్‌ప్రొడక్షన్ ఫెసిలిటీ ఫర్ సినిమా & హోమ్‌ను ఏర్పాటు చేయడం వరకు, భారతీయ సినిమాలను మ్యాప్‌లో ఉంచడమే మా ప్రయత్నం. అన్నపూర్ణ స్టూడియోస్ 50వ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, డాల్బీతో ఈ సహకారం గొప్ప దార్శనికతకు నిదర్శనం. అన్నపూర్ణలో చేంజ్  ఇన్నోవేషన్ స్వీకరించడం మా లెగసీ, ఇది ఆ ప్రయాణంలో మరో ముందడుగు' అన్నారు
 
అన్నపూర్ణ స్టూడియోస్ ED సుప్రియా యార్లగడ్డ ఈ మైలురాయి ప్రాముఖ్యతను చెప్పారు. "సినిమా & హోమ్ కోసం డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్‌ప్రొడక్షన్ ఫెసిలిటీతో, భారతదేశంలో సినిమాల క్రియేషన్ ఎక్స్ పీరియన్స్ ని పునర్నిర్వచించే గేమ్-ఛేంజింగ్ టెక్నాలజీని మేము పరిచయం చేస్తున్నాము. ఫిల్మ్ మేకర్స్ తమ కథలను అద్భుతమైన ప్రభావంతో చెప్పడానికి మేము సాధికారత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము' అన్నారు.
 
ఈ కార్యక్రమంలో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్‌లో స్పెషల్ కంటెంట్, RRR నుంచి సీన్స్ ప్రదర్శించారు, ఇది ఇవి ఫెసిలిటీ ఫీచర్స్ ని హైలైట్ చేశాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరికి గేమ్ ఛేంజర్ అవుతుంది...రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ