కళాకృతులను గౌరవిస్తూ అందులోనూ దేవుడి గుడి పవిత్రతను కాపాడాలి. కానీ ఉపాసన తెలిసో తెలియకో తమిళనాడులోని గుడి ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇందులో చరణ్, తాను ఎక్కడున్నామో చెప్పుకోండంటూ పజిల్ వదిలింది. కానీ దానికి తీవ్ర వ్యతిరేక వచ్చేసింది. రిపబ్లిక్ డే నాడు జరిగిన ఈ సంఘటన ఇంకా వైరల్ అవుతూనే వుంది. ఇది ఎవరో పెట్టిన డిజైన్ బాగా కూర్చారంటూ కామెంట్ కూడా పెట్టడంతో అది కాస్త ఎదురు తిరిగింది.
ఇది తాను ఎడిట్ చేసి పెట్టలేదని ఎవరో ఇలా చేశారని. ఎదరో అనేది నేరుగా మెసేజ్ చేస్తే అభినందించాలని ఉందంటూ ఉపాసనా రాసుకొచ్చారు. ఆమె పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయ్యింది.. ఇంతవరకు ఆమె పోస్టులకు పాజిటివ్ కామెంట్స్ చేసేవారంతా ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు.
చరణ్ అభిమానుల్లో ఒకరు ఇలా చేయడంతో అది కాస్త ఎదురుతిరిగింది. హిందూత్వం, గుడి పవిత్రతను కాపాడాల్సింది పోయి ఇలాంటి బొమ్మలు పెట్టి ఏమి చెప్పదలచుకున్నారంటూ ఫాలోవర్స్ తిరిగి ట్వీట్ చేశారు. దీనిపై చరణ్ స్పందించాలంటూ కొందరు ఏకంగా పోస్ట్‌లే పెడుతున్నారు. ఉపాసన మరి క్షమాపణలు చెబుతుందో లేదో చూడాలి.