Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ నెలలో - నీ జతగా విడుదల

Advertiesment
ఈ నెలలో - నీ జతగా విడుదల
, గురువారం, 23 సెప్టెంబరు 2021 (17:29 IST)
Nee jataga still
భమిడిపాటి వీర దర్శకత్వంలో సుబంద్రా క్రియేషన్స్ బ్యానర్ పై రామ్ బి నిర్మిస్తున్న సినిమా `నీ జతగా. భరత్ బండారు, జ్ఞానేశ్వరి, నయని పావని, ప్రవణ్, బాలరాజు పులుసు, సునీల్ రాజ్,దీపక్ దగని, దీపు సల్ల ,మెహబూబ్ భాషా, లిపికా,బాషా తదితర తారాగణంతో రూపొందిన ఈ చిత్రం ఈనెల‌లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
చిత్రం ద‌ర్శ‌కుడు భమిడిపాటి వీర మాట్లాడుతూ, మా టీజర్ కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన లభిచింది, అలాగే మా మూవీ లోనిసాంగ్స్ అనంత్ శ్రీరామ్ గారు రాయటం అలాగే ఒక సాంగ్ ను రిలీజ్ చేసినందుకు అనంత్ శ్రీరామ్ గారికి మా ధన్యవాదములు అని తెలిపారు. అలాగే మా మా పాడిన అనురాగ్ కులకర్ణి కి కూడా ధన్యవాదాలు అని తెలిపారు 
 
ప్రొడ్యూసర్ రామ్.బి మాట్లాడుతూ, గతం లో మా సినిమా టీజర్ కి  మంచి స్పందన లభించింది, అనంత్ శ్రీరామ్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాం అందరూ  ఆదరిస్తారు అని కోరుకుంటున్నాం, ఇక పోతే ఈ సినిమా మా డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించటం జరిగింది, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ మా సినిమా మీద చాలా నమ్మకం తో వున్నారు, అందువలన ఇలాంటి కోవిడ్ సిట్యుయేషన్ లో మాకు ఇది ఒక శుభసూచికంగా భావిస్తున్నాం, మా సినిమా ని తప్పకుండా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. 
 
ఈ మూవీ లో `ఇదే ఇదే` సాంగ్ రాసిన అనంత్ శ్రీ రామ్ మాట్లాడుతూ, ఈ సాంగ్ యొక్క సారాంశాన్ని చాలా క్లుప్తంగా వివరించారు, ప్రయాణం, జీవితం ఒకే చోట మొదలయినప్పుడు ట్రక్కింగ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సాంగ్ మొదలు అవుతుంది, ఈ సాంగ్ లో పకృతి గురించి చాలా ఆహ్లాదకరమయిన పదాలు జోడించి ఈ సాంగ్ రాయటం జరిగింద‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్ వర్సెస్ రావణ్- సినిమా షూటింగ్ ప్రారంభం