Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుక్క అంటే అర్థం ఇది.. కౌశల్ కవరింగ్... నాని అసంతృప్తి

బిగ్ బాస్ సీజన్ 2కి చివరి శనివారం కావడంతో అందరిలోనూ ఆసక్తి కనిపించింది. నాని ఈ వారం ఎవరికీ క్లాస్ పీకకూడదని ఎంతగా అనుకున్నప్పటికీ హౌస్‌లో జరిగిన పరిణామాల వల్ల ఈ వారం కూడా తప్పలేదు. నువ్ ఇదే మాట బయట అనుంటే ఏం చేసేవాడినో తెలుసా అంటూ కౌశల్‌ని హెచ్చరించా

కుక్క అంటే అర్థం ఇది.. కౌశల్ కవరింగ్... నాని అసంతృప్తి
, సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:01 IST)
బిగ్ బాస్ సీజన్ 2కి చివరి శనివారం కావడంతో అందరిలోనూ ఆసక్తి కనిపించింది. నాని ఈ వారం ఎవరికీ క్లాస్ పీకకూడదని ఎంతగా అనుకున్నప్పటికీ హౌస్‌లో జరిగిన పరిణామాల వల్ల ఈ వారం కూడా తప్పలేదు. నువ్ ఇదే మాట బయట అనుంటే ఏం చేసేవాడినో తెలుసా అంటూ కౌశల్‌ని హెచ్చరించావ్.. ఇప్పుడే నిన్ను కౌశల్‌ని బయటకు పంపిస్తా.. కౌశల్‌ని టచ్ చేయి చూద్దాం, నువ్వేమన్నా పెద్ద రౌడీవా అంటూ తనీష్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చారు నాని. మొదటి నుండి నీ టెంపర్ తగ్గించుకోమని చెప్పినా ఇన్నిరోజులైనా నీలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా కాని నువ్ నీ ప్రవర్తనను మార్చుకోలేదంటూ చురకలు అంటించారు నాని.
 
ఇక మొదటి నుండి చాలా బ్యాలెన్స్డ్‌గా గేమ్ ఆడి, అందరికీ ధైర్యం చెప్పిన నువ్ కూడా ఎందుకు అంతగా బ్లాస్ట్ కావల్సి వచ్చిందని రోల్‌ని అడగగా అమిత్ వెళ్లిన తరువాత ఒంటరిగా మారానని, ఫ్యామిలీ గుర్తొచ్చిందని చెప్పారు. ఇక గీతా ఒక విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకుండా అందులో అందర్నీ ఇన్వాల్వ్ చేయడం వల్ల ఎవ్వరికీ ఏమీ కన్వే కావట్లేదన్నారు. ఇక చివరిగా కౌషల్ దగ్గరకొచ్చి వివరణ కోరగా కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు.
 
ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడినా ఎప్పుడూ మీరు అనే మాట తప్ప ఇంకోటి రాలేదని, అలాంటిది మీ నుండి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదరన్నారు నాని. నేను టేబుల్ దగ్గర తినేటప్పుడు వీళ్లందరూ.. జీపీడీ అంటారు దాని మీనింగ్ ఏంటో నాకు తెలీదు. అలాగే తాను కూడా షార్ట్‌కట్‌లో కుక్క అంటే.. ‘కూర్చుని ఉండకుండా కేవ్ కేవ్ అరిచేవాడు’ అంటూ కొత్త అర్థం ఇచ్చారు కౌశల్. ఏం మాట్లాడుతున్నారు కౌషల్, అంటూ అందరూ మండిపడగా హౌస్‌లో వేరే జంతువులు ప్రస్తావనకు రావని ఎప్పుడూ కుక్క సౌండ్‌లు వినిపిస్తుంటాయని, అందుకే వాడానని చిత్రమైన వివరణ ఇచ్చారు. దీంతో ఆశ్చర్యానికి గురైన నాని మరి ఈ మాట అప్పుడే ఎందుకు చేప్పలేదని అడిగారు. 
 
కోపంలో అన్నావని.. దానికి నువ్ ఇప్పుడు చెప్తున్న వివరణకు సంబంధమే లేదన్నారు నాని. పక్కనే ఉన్న సామ్రాట్ ఆలోచించుకుని ఫుల్ ఫామ్‌లు చెప్పడం కరెక్ట్ కాదనడంతో, నాని మీరు మాట్లాడే దానిలో లాజిక్ లేదు, కోపంలో ఎవరైనా ఒక మాట అనడం సహజం, కానీ మీ అందరి ప్రవర్తనతో చెడ్డ పేరు మాత్రం వచ్చిందని స్పష్టం చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో సుమంత్ లుక్... నాగ్ ఏమన్నారో తెలుసా..?