Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టైగర్ నాగేశ్వరరావు లో రొమాంటిక్ యాంగిల్‌ తెలిపే వీడు.. సాంగ్ రాబోతుంది

Advertiesment
Veedu song still
, సోమవారం, 18 సెప్టెంబరు 2023 (18:55 IST)
Veedu song still
పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ మేకర్స్ మ్యూజిక్ జర్నీని ఎక్ దమ్ అనే ఎలక్ట్రిఫైయింగ్ నంబర్‌తో ప్రారంభించారు. ఈ పాట సూపర్ హిట్‌ అయ్యింది. టైగర్ నాగేశ్వరరావులోని రొమాంటిక్ యాంగిల్‌ని ఈ పాట చూపించింది. ఇప్పుడు  టైగర్ మ్యాసీ సైడ్ ని చూపించాల్సిన సమయం వచ్చింది. సెప్టెంబరు 21న విడుదల కానున్న రెండవ పాట వీడు లో టైగర్ నాగేశ్వరరావు ఫెరోషియస్ అవతార్ ని చూపించనున్నారు.
 
పోస్టర్ లో టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ ఇంటెన్స్, ఫెరోషియస్ గా నడుచుకుంటూ కనిపించారు. అతను బీడీ తాగుతున్నప్పుడు, వెనుక ఉన్న వ్యక్తులు క్రేజీగా వైల్డ్ డ్యాన్స్ లు చేయడం కనిపిస్తోంది. ఈ పోస్టర్ టైగర్ నాగేశ్వరరావుకి తగినంత ఎలివేషన్ ఇస్తుంది, సెప్టెంబర్ 21న మనం ఎలాంటి మాసీవ్ నెంబర్ ని చూడబోతున్నామో ఊహించుకోవచ్చు.
 
ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాలను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.
 
దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.  
 
తారాగణం: రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్న‌జీయ‌ర్ స్వామి శిష్యుల వేద మంత్రాల‌తో ఇంటిలోకి ప్రవేశించిన రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న, క్లీంకార