Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ రోజు నా భార్య అండగా నిలవకపోయింటే.. నా పరిస్థితి..? జబర్దస్త్ దొరబాబు

Advertiesment
ఆ రోజు నా భార్య అండగా నిలవకపోయింటే.. నా పరిస్థితి..? జబర్దస్త్ దొరబాబు
, శనివారం, 14 నవంబరు 2020 (16:47 IST)
ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ కామెడీ షోతో సంపాదించుకున్న పేరు మొత్తం ఒకేసారి ఆ మధ్య వ్యభిచారం కేసులో దొరికి పోగొట్టుకున్నాడు దొరబాబు. మార్చిలో ఈయన ఓ ఇంట్లో పోలీసులకు దొరికిపోయాడు. అది కాస్తా అప్పట్లో సంచలనంగా మారిపోయింది. దాన్ని హైపర్ ఆది ఇప్పటికీ తన ప్రతీ స్కిట్‌లో వాడుకుంటూ కామెడీ పుట్టిస్తున్నాడు. 
 
నిజానికి ఆ రోజు పేకాట ఆడుతున్న బ్యాచ్‌పై రైడింగ్ కోసం వెళ్తే అనుకోకుండా దొరబాబు పోలీసుల ముందు దొరికిపోయాడని చెప్తుంటారు. అక్కడ తానే తప్పు చేయలేదని ఇప్పటికీ చెప్తూనే ఉన్నాడు దొరబాబు. ఆయనతో పాటు పరదేశీ కూడా పట్టుబడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో దొరికిన తర్వాత కూడా దొరబాబు భార్య మాత్రం ఆయనకే అండగా నిలబడింది. తనకు తన భర్తంటే ఏంటో తెలుసు అంటూ అందరికీ సమాధానమిచ్చింది. నెల్లూరు లోకల్ టీవీ యాంకర్ అమూల్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దొరబాబు. వీళ్ల ప్రేమకు గుర్తుగా ఓ కూతురు కూడా ఉంది.
 
భార్యకు అన్యాయం చేయడానికి నీకు మనసెలా వచ్చిందయ్యా అంటూ అంతా అంటుంటే కూడా తన భర్త అలాంటి వాడు కాదని అందరికీ సమాధానం చెప్పింది అమ్ము. అవతలి వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే అతడిలో లోపాలు మీకు కనిపించవు.. ఉన్నా బయట పెట్టరు అంటూ చెప్పుకొచ్చింది. తన భర్తపై నమ్మకం ఉందని.. అతనెలాంటి వాడు అనేది తెలుసు అంటూ చెప్పింది అమూల్య. 
 
ఇప్పుడు యాంకర్ రవి హోస్ట్ చేస్తున్న నేను రెడీ నువ్వు రెడీ షోలో తన భార్య గురించి చెప్పాడు దొరబాబు. ఆ రోజు ఏం జరిగిందో తనకు, తన భార్యకు తెలుసు అని.. ఇంకెవరికీ తను సమాధానం చెప్పుకోవాల్సి అవసరం లేదని చెప్పాడు. ఆ రోజు అలాంటి పరిస్థితుల్లో తన భార్య అండగా నిలబడకపోతే ఈ రోజు తాను ఈ స్టేజీలో ఉండేవాన్ని కాదని చెప్పాడు దొరబాబు. తన జీవితంలో అమ్ము దొరకడం అదృష్టం అంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ టీజర్ అదుర్స్.. 1 మిలియన్ లైక్స్, లక్ష కామెంట్లు