కథానాయకుడు కార్తీ తనకు రాజకీయాల గురించి తెలీయదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడిగా వుంది. కమల్‌హాసన్ కూడా పార్టీ పెట్టి సేవచేయబోతున్నారు. మరి నటుడిగా మీ అభిప్రాయమని ఏమిటని వెబ్ దునియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ఇది సీరియస్ క్వశ్చన్. మీరు చాలా కాజువల్‌గా అడిగారు. అనగానే అక్కడ ఆయనతోసహా అందరూ నవ్వులతో సందడి నెలకొంది. అనంతరం ఆయన తనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదన్నారు.
కార్తీ నటించిన `సుల్తాన్` ఏప్రిల్ 2న విడుదల కాబోతుంది. ప్రమోషన్‌లో భాగంగా మంగళవారంనాడు ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
- నాగార్జున `వైల్డ్ డాగ్` ప్రమోషన్‌లో బాగంగా `సుల్తాన్` గురించి మాట్లాడరని చెప్పగానే, ఇందుకు నాగార్జున సార్‌కు థ్యాంక్స్. అది కూడా ఇక్కడ చెప్పడం తక్కవే. నా సినిమా కోసం ఆయన ఫంక్షన్‌లో విష్‌చేయడం ఆనందంగా వుంది.
- నేను చెన్నై నుంచి హైదాబాద్లో లాండ్ కాగానే మొదటి కలిసేది దర్శకుడు వంశీ, నాగ్ సార్‌నే. నా సినిమా కథ నచ్చి ఆయనకు వినిపించాలని వెళ్ళేవాడిని. ఇప్పుడు నా మీద కేర్ తీసుకుని మాట్టాడడం అంతకన్నా నాకేమీ కావాలి అని చెప్పారు.