Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

130 కోట్ల మంది భారతీయులు చూడాల్సిన చిత్రం సైరా : తెలంగాణ గవర్నర్

Advertiesment
130 కోట్ల మంది భారతీయులు చూడాల్సిన చిత్రం సైరా : తెలంగాణ గవర్నర్
, గురువారం, 10 అక్టోబరు 2019 (11:20 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. గాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌ను సాధించింది. 
 
అయితే, ఈ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వీక్షించారు. వారి కోసం ప్రత్యేక షోను చిత్ర యూనిట్ వేసింది. ఈ చిత్రాన్ని వీక్షించిన తర్వాత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మాట్లాడుతూ, గడచిన 20 సంవత్సరాల్లో తాను చూసిన రెండో చిత్రం చిరంజీవి నటించిన 'సైరా' అని చెప్పారు. 
 
చిత్రంలో చిరంజీవి అద్భుతంగా నటించారని కితాబిచ్చారు. 1999 తర్వాత తాను 2018లో రజనీకాంత్ నటించిన 'కాలా' చూశానని, ఆపై తాను చూసిన రెండో చిత్రం ఇదేనని ఆమె అన్నారు. ఈ చిత్రాన్ని 130 కోట్ల మంది భారతీయులు చూడాలని కోరారు. 
 
తమిళిసై కోసం సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించగా, ఆమె కుటుంబ సభ్యులతో పాటు, చిరంజీవి కుటుంబీకులు కూడా సినిమా చూశారు. కాగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన 'సైరా' విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.
 
ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ నిర్మించగా, ఇందులో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, కిచ్చా సుధీప్, విజయ్ సేతుపతి వంటి అగ్ర నటీనటులంతా నటించారు. మొత్తం రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరుణానిధిగా ప్రకాష్ రాజ్.. ఎంజీఆర్‌గా అరవింద్ సామి.. అమ్మగా కంగనా