Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైరా అద్భుతం, 130 కోట్ల మంది చూడాల్సిన సినిమా: తెలంగాణ గ‌వ‌ర్న‌ర్(Video)

Advertiesment
సైరా అద్భుతం, 130 కోట్ల మంది చూడాల్సిన సినిమా: తెలంగాణ గ‌వ‌ర్న‌ర్(Video)
, బుధవారం, 9 అక్టోబరు 2019 (18:54 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా సంచ‌ల‌నం సైరా న‌ర‌సింహారెడ్డి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రూపొందిన సైరా రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్‌తో స‌క్స‌స్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 
 
అయితే... మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన #SyeRaaNarasimhaReddy స్పెష‌ల్ షోని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళసై సౌంద‌ర‌రాజ‌న్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చూసారు.
 
ఈ సంద‌ర్భంగా తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళసై సౌంద‌ర‌రాజ‌న్ మాట్లాడుతూ.... సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా అద్భుతంగా ఉంది. నాకు చాలా బాగా న‌చ్చింది. ఎంత‌లా న‌చ్చింది అంటే... మాట‌ల్లో చెప్ప‌లేనంత‌గా. నా ఫీలింగ్ చెప్ప‌డానికి మాట‌లే లేవు అని చెప్చ‌చ్చు.
 
 స్వాతంత్ర్యం సాధించ‌డానికి స్పూర్తిని అందించినవారిలో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డితో పాటు త‌మిళ‌నాడుకు చెందిన రాజ‌పాండియ‌ కూడా ఎంతో ముఖ్య పాత్ర పోషించాడు అనేది చాలా చ‌క్క‌గా చూపించారు. 
 
బ్ర‌ద‌ర్ చిరంజీవి ఇంకా ఇలాగే మ‌రిన్ని సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను. 130 కోట్ల భార‌తీయుల్లో స్పూర్తి క‌లిగించే సినిమా న‌ర‌సింహారెడ్డి. అందుచేత‌ ప్ర‌తి ఒక్క‌రు సైరా సినిమా చూడాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చూడండి ఈ యువకులు ఏం చేశారో... సీఎం జగన్ చూస్తే?(Video)