Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మీకు నన్ను నవ్వించే టాలెంట్ ఉందా?' అయితే నా షోకు రమ్మంటున్న ఐస్‌క్రీమ్ బ్యూటీ...

బిగ్ స్క్రీన్ కంటే బుల్లితెరపై రాణించేందుకు ఎక్కువ మంది సెలెబ్రిటీలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా తమ వ్యాఖ్యానంతో సాగే కార్యక్రమాలు, షోలు నిర్వహించేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఇలా బుల్లితెరపై యాంకర్

Advertiesment
'మీకు నన్ను నవ్వించే టాలెంట్ ఉందా?' అయితే నా షోకు రమ్మంటున్న ఐస్‌క్రీమ్ బ్యూటీ...
, సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:32 IST)
బిగ్ స్క్రీన్ కంటే బుల్లితెరపై రాణించేందుకు ఎక్కువ మంది సెలెబ్రిటీలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా తమ వ్యాఖ్యానంతో సాగే కార్యక్రమాలు, షోలు నిర్వహించేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఇలా బుల్లితెరపై యాంకర్లుగా చేస్తూ రాణిస్తున్న వారిలో అనసూయ, రేష్మి, శ్రీముఖి ఇలా అనేక మంది ఉన్నారు.
 
అంతేనా... మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని తదితరులు కూడా బుల్లితెరపై హల్‌చల్ చేశారు... చేస్తున్నారు. ఇపుడు ఈ కోవలో 'ఐస్‌క్రీమ్' ఫేమ్ తేజస్వి మడివాడ చేరనున్నారు. 
 
ప్రముఖ టీవీ ఛానెల్ స్టార్ మా ఓ కామెడీ షోను ప్రసారం చేయబోతున్నారు. దీనికి ప్రముఖ సీనియర్ కవెుడియన్ బ్రహ్మానందం జడ్జిగా వ్యవహరించనున్నారు. కాగా ఈ ప్రోగ్రామ్‌కు తేజస్వి మడివాడ వ్యాఖ్యానం చేయబోతున్నారని సమాచారం. 'మీకు నన్ను నవ్వించే టాలెంట్ ఉందా?' అయితే నా షోకి రండి.. అంటూ రీసెంట్‌గా ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి లాఫ్టర్ చాలెంజ్ చేశారు. త్వరలోనే ఈ షో ప్రసారం కానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెంగీ జ్వరంతో ఆస్పత్రిపాలైన బాలీవుడ్ కమెడియన్ కపుల్స్