Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు 'ధోనీ బయోపిక్' హీరో అంత్యక్రియలు - కరోనా రిపోర్టు రిజల్ట్ ఏంటి?

Advertiesment
నేడు 'ధోనీ బయోపిక్' హీరో అంత్యక్రియలు - కరోనా రిపోర్టు రిజల్ట్ ఏంటి?
, సోమవారం, 15 జూన్ 2020 (09:11 IST)
భారత క్రికెటర్ ఎంఎస్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎంఎస్ ధోనీ అన్‌టోల్డ్ స్టోరీలో హీరోగా నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. అతని అంత్యక్రియలు సోమవారం ముంబైలో జరుగనున్నాయి. అంతేకాకుండా, సుశాంత్ మృతదేహాని కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో నెగెటివ్ అని తేలింది. దీంతో సుశాంత్ కుటుంబ సభ్యులో ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సుశాంత్ కుటుంబ సభ్యులు పాట్నా నుంచి ముంబైకు ఇప్పటికే చేరుకున్నారు. 
 
కాగా, గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న సుశాంత్... ముంబై బాంద్రాలోని తన నివాసంలోనే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
మరోవైపు, తన కుమారుడు సుశాంత్ మరణ వార్త తెలుసుకున్న తండ్రి కృష్ణకుమార్ సింగ్ కుప్పకూలిపోయారు. ఈయన పాట్నాలో నివసిస్తున్నారు. ఆయనకు ఈ మరణవార్త తెలియగానే కుప్పకూలిపోయారు. సుశాంత్ ఆత్మహత్య విషయం తెలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని పాట్నా నివాసంలో సంరక్షకురాలిగా వ్యవహరిస్తున్న లక్ష్మీ దేవి వెల్లడించారు. 
 
సుశాంత్ అక్క చండీగఢ్ నుంచి పాట్నా బయల్దేరారని తెలిపారు. సుశాంత్ స్వస్థలం బీహార్ లోని పూర్ణియా జిల్లా మాల్దిహా ప్రాంతం. సినిమాలపై ఆసక్తితో ముంబయి చేరుకుని అంచెలంచెలుగా ఎదిగాడు. కానీ డిప్రెషన్‌కు‌లోనై బలవన్మరణం చెందినట్టు భావిస్తున్నారు. కానీ, సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుశాంత్ సూసైడ్.. మాటలకందని వేదన : ప్రిన్స్ మహేష్ బాబు