Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్రగ్స్ కేసు.. ఎన్సీబీ విచారణ ఓవర్.. దీపికా పదుకునేకు రెండోసారి సమన్లు

Advertiesment
Sushant Singh Rajput Case
, శనివారం, 26 సెప్టెంబరు 2020 (20:50 IST)
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణ ముగిసింది. బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకునేకు రెండోసారి సమన్లు ఇవ్వమని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం నలుగురు హీరోయిన్లను ప్రశ్నించామని అధికారులు తెలిపారు. శనివారం నలుగురి స్టేట్మెంట్‌లను రికార్డ్ చేశామని అన్నారు. సారా ఆలీఖాన్, శ్రద్దా కపూర్‌లను రెండు కేసుల్లో ప్రశ్నించామని అధికారులు పేర్కొన్నారు.
 
ఇక కరణ్ జోహార్‌కు ఈ కేసుతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చేశామని ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు. కేవలం దీపిక చాటింగ్‌ను మాత్రమే పరిశీలించామని సుశాంత్ కేసు ఆధారంగానే వీరిని ప్రశ్నించామని పేర్కొన్నారు. 
 
రియా చక్రవర్తి సారా అలీ ఖాన్, శ్రద్దా కపూర్ పేర్లు చెప్పిందని, కానీ విచారణలో మాత్రం వారిద్దరూ డ్రగ్స్ వాడలేదని తెలిపారని చెప్పారు. ఈ కేసులో ధర్మా ప్రొడక్షన్‌కు చెందిన క్షితిస్ ప్రసాద్‌ను అరెస్ట్ చేశామని అధికారులు ప్రకటించారు.
 
ఇకపోతే.. ఈ విచారణలో పలు కీలక విషయాల్ని దీపిక వెల్లడించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తన మేనేజర్ కరిష్మాతో 2017లో జరిపిన వాట్సాప్ ఛాటింగ్స్ తనవేనని దీపిక అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే డ్రగ్స్ మాత్రం ఎప్పుడూ తీసుకోలేదని తెలిపిందట. 
 
దాదాపు ఇవే రకమైన ప్రశ్నల్మి మిగతా ఇద్దరు హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ ఎదుర్కొన్నారు. సుశాంత్‌తో తాము పార్టీలకు హాజరైన విషయాన్ని వీళ్లు అంగీకరించారు. అయితే అక్కడ మాదకద్రవ్యాలు సేవించలేదని వీళ్లు అధికారులకు తెలియజేశారు.
 
ప్రస్తుతానికి వీళ్ల ముగ్గుర్ని ఇంటికి పంపించిన అధికారులు.. మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వీళ్లలో దీపిక చెప్పిన సమాధానాలపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేయలేదంటూ జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో.. ప్రియుడి కోసం రూ.25లక్షలు ఖర్చు చేసిందా?