Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్ర‌భాస్ దెబ్బ‌కి 'బందోబస్త్' విడుదల తేదీ మార్చిన సూర్య‌... ఇంత‌కీ రిలీజ్ ఎప్పుడు..?

Advertiesment
Suriya
, మంగళవారం, 6 ఆగస్టు 2019 (18:22 IST)
కోలీవుడ్ స్టార్ హీరో, 'గజిని', 'సింగం' సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సూర్య హీరోగా నటిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ 'బందోబస్త్'. 'రంగం' ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తమిళ సినిమా 'కప్పాన్'కు తెలుగు అనువాదమిది. తెలుగు ప్రేక్షకులకు 'నవాబ్', విజువల్ వండర్ '2.0' చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. 
 
సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, కీలక పాత్రలో ఆర్య నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగ‌ష్టు 30న రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే... ప్ర‌భాస్ సాహో అదే డేట్‌న రిలీజ్ అవుతుండ‌టంతో ఇష్టం లేక‌పోయినా సూర్య బందోస్త్ చిత్రాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేయాల‌ని నిర్ణ‌యించార‌ట‌. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. 
 
తెలుగులో సూర్యకు స్టార్ ఇమేజ్ రావడానికి పునాది వేసిన 'గజినీ' సెప్టెంబర్ నెలలో విడుదల కావడం విశేషం. 'బందోబస్త్' తమిళ వెర్షన్ 'కాప్పాన్' పాటలు ఇటీవలే సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదల అయ్యాయి. హేరీశ్ జైరాజ్ స్వరపరిచిన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. త్వరలో తెలుగు వెర్షన్ పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోనీ మ్యూజిక్ సంస్థ ద్వారా ఆడియో విడుదల కానుంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డిఫరెంట్ గెటప్పుల్లో సూర్య నటన, పాకిస్తాన్‌ తీరును ఎండగడుతూ మోహ‌న్‌లాల్‌ చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌, కథా నేపథ్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సినిమాపై అంచనాలను టీజర్ మరింత పెంచింది. అందువల్ల, విడుదలకు నెలన్నర ముందే శాటిలైట్ హక్కులు హాట్ కేకులా అమ్ముడయ్యాయి. ఈ సినిమా శాటిలైట్ హక్కులను భారీ రేటుకు ప్రముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్, స‌న్ నెట్‌వ‌ర్క్‌కి చెందిన 'జెమినీ' సొంతం చేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రైవేట్ గదిలో పెళ్లి చేసుకున్నా... హనీమూన్ తర్వాత వెళ్లిపోయాడు...