అఖండ సినిమా నేడు విడుదలైన అన్నిచోట్ల హౌస్‌ఫుల్తో వుండడంతోపాటు ఐమాక్స్ థియేటర్‌లో రష్ చూసి ఆశ్చర్యపోతున్నారు. కరోనా తర్వాత ఇంతటి జనాలు చూసి సినిమా ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా ఓపెనింగ్ రోజు థియేటర్లలో ఎలా వుంటారో అంత ఇదిగా ఇందులో వున్నారు. ఐమాక్స్‌లో అన్ని స్క్రీన్లు అఖండ వేయడంతో బయటకు వచ్చేటప్పుడు పై నుంచి కిందకు దిగడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
- ఐమాక్స్ థియేటర్‌లో మార్నింగ్ షోకు హాజరైన రాజమౌళి కుటుంబం ముగింపు తర్వాత క్లాప్స్ కొట్టారు.
- ఇక అఖండ ఓపెనింగ్స్ సందర్భంగా మహేస్‌బాబు, నాని, రామ్ పోతినేని, మంచు విష్ణు తదితరులు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలియజేశారు. నందమూరి బాలకృష్ణగారికి, అఖండ టీమ్ కి అభినందనలు అని తెలిపారు.
మహేష్‌బాబు పేర్కొంటూ, అఖండ ప్రారంభం అఖండంగా వున్నందుకు సంతోషంగా వుందని తెలిపారు. రామ్ పోతినేని ఇలా రాశారు. అఖండ గురించి గొప్ప విషయాలు వింటున్నాను.బాలకృష్ణ గారికి అభినందనలు..బోయపాటి శ్రీను గారూ, ద్వారకాక్రియేషన్ వారికి, థమన్ సంగీతానికి శుభాకాంక్షలు తెలిపారు.
మంచు విష్ణు స్పందిస్తూ, తెలుగు సినిమా హవా మొదలైంది. బిగ్ స్క్రీన్ పై అఖండ చిత్రం ను చూసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.