Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మద్యం సేవించే అలవాటు ఉందా? రాజమౌళి ఏమన్నారు...

మీకు మద్యం సేవించే అలవాటు ఉందా? అనే ప్రశ్నకు దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తనదైనశైలిలో స్పందించారు. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర పోలీసులు నిర్వహించారు. ఇందులో రాజమౌళితో పాటు హీరో అల్లు అ

Advertiesment
మద్యం సేవించే అలవాటు ఉందా? రాజమౌళి ఏమన్నారు...
, గురువారం, 20 జులై 2017 (09:33 IST)
మీకు మద్యం సేవించే అలవాటు ఉందా? అనే ప్రశ్నకు దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తనదైనశైలిలో స్పందించారు. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర పోలీసులు నిర్వహించారు. ఇందులో రాజమౌళితో పాటు హీరో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మందు కొట్టే అలవాటు లేదని, అందువల్లే తాగిన వారు ఆ సమయంలో ఎలా ఉంటారు? ఎలా ప్రవర్తిస్తారన్న విషయాలు తనకు తెలియవన్నారు. అయితే, యూత్ సరదా కోసం డ్రింక్ చేసినా, ఆపై బైకులు, కార్లను మాత్రం తీయవద్దని కోరారు. 
 
మద్యం సేవించిన వారు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, అవసరమైతే స్నేహితుల సహాయం తీసుకుని ఇళ్లకు చేరుకోవాలే తప్ప, సొంతంగా మాత్రం నడపవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకరు చేసిన తప్పుతో కుటుంబం ఛిన్నాభిన్నం కాకుండా చూసుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్‌–ప్రొఫెషనల్స్‌కి సంఘమిత్ర అర్థం కాదులే.. శ్రుతిపై కుష్‌బు అంత మాటనిందా..