Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్‌–ప్రొఫెషనల్స్‌కి సంఘమిత్ర అర్థం కాదులే.. శ్రుతిపై కుష్‌బు అంత మాటనిందా..

బాహుబలి 2 చిత్రం ప్రేరణతో తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తలపెట్టిన చారిత్రక కావ్యం సంఘమిత్రకు ఇంకా బాలారిష్టాలు తొలిగినట్లు లేదు. పైగా ముందుగా హీరోయిన్ అనుకున్న శ్రుతి హసన్ చిత్ర నిర్మాతల జాప్యం ధోరణికి విసికిపోయి చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు

Advertiesment
అన్‌–ప్రొఫెషనల్స్‌కి సంఘమిత్ర  అర్థం కాదులే.. శ్రుతిపై కుష్‌బు అంత  మాటనిందా..
హైదరాబాద్ , గురువారం, 20 జులై 2017 (09:23 IST)
బాహుబలి 2 చిత్రం ప్రేరణతో తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తలపెట్టిన చారిత్రక కావ్యం సంఘమిత్రకు ఇంకా బాలారిష్టాలు తొలిగినట్లు లేదు. పైగా ముందుగా హీరోయిన్ అనుకున్న శ్రుతి హసన్ చిత్ర నిర్మాతల జాప్యం ధోరణికి విసికిపోయి చిత్రం నుంచి  తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఆతర్వాత కొద్దిరోజులకు బలమైన కారణాల వల్లే శ్రుతిని ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుంచి తప్పించినట్లు నిర్మాతలు చావుకబురు చల్లగా కాదు లేటుగా చెప్పారు. ఇప్పుడు తన భర్త, సంగమిత్ర చిత్ర దర్శకుడు సి సుందర్‌కు అతడి భార్య కుష్‌బు మద్దతుగా ముందుకు వచ్చింది. 
 
ప్రముఖ నటి, దర్శకుడు సుందర్‌. సి సతీమణి ఖుష్బూ టైమ్‌ చూసి ట్విట్టర్‌లో పెద్ద బాంబు పేల్చారు. ఖుష్బూ బాంబు వేసింది శ్రుతీహాసన్‌పైనే అనేది చాలామందికి అర్థమైంది. కానీ, ఎక్కడా శ్రుతి పేరు లేకుండా ఖుష్బూ బాంబు వేయడం గమనార్హం! మేటర్‌లోకి వెళితే... బౌండ్‌ స్క్రిప్ట్‌ ఇవ్వని కారణంగా సుందర్‌. సి తెరకెక్కించనున్న ‘సంఘమిత్ర’ నుంచి తప్పుకున్నానని శ్రుతీ పేర్కొన్న సంగతి తెలిసిందే. శ్రుతీ ఆరోపణలపై చాలా రోజుల తర్వాత ఖుష్బూ స్పందించారు. 
 
‘‘సరైన ప్లానింగ్‌ లేకుండా ‘సంఘమిత్ర’ వంటి భారీ బడ్జెట్‌ సినిమా తీయలేం. ఎవరో ‘సంఘమిత్ర’ స్క్రిప్ట్‌ రెడీ కాలేదంటూ ఆరోపణలు చేయడం విన్నా. గత రెండేళ్లుగా ఈ సినిమా వర్క్‌ జరుగుతోంది. అన్‌–ప్రొఫెషనల్స్‌కి అది అర్థం కాదు. ‘సంఘమిత్ర’ వంటి సినిమాలకు షూటింగ్‌ అనేది 30 శాతం మాత్రమే. షూటింగ్‌కి ముందే 70 శాతం వర్క్‌ పూర్తవుతుంది’’ అని ఖుష్బూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 
 
ఇవన్నీ శ్రుతీని ఉద్దేశించినవే అని కోలీవుడ్‌ టాక్‌! ‘‘ఓ లెగస్సీ (కమల్‌హాసన్‌ వారసత్వం) కొనసాగిస్తున్న వారినుంచి కొంచెం ప్రొఫెషనలిజమ్‌ ఆశించా. నీ (బహుశా శ్రుతీని ఉద్దేశించే అయ్యుంటుంది) తప్పులను హుందాగా అంగీకరిస్తే, ఇంకా ఎంతో దూరం వెళ్తావు’’ అని ఖుష్బూ చురకలు అంటించారు.
 
సంగమిత్ర సినిమా నిర్మాణంపై దృష్టి పెట్టడం మాని ఈ అనవసర వివాదాల్లో చిత్ర నిర్మాలు, దర్సకులు ఎందుకు పాత్ర పోషిస్తున్నారు అంటూ నెటిజన్లు మేలమాడుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐటెమ్ సాంగ్‌.. అనుష్క.. 2 కోట్ల రెమ్యునరేషన్.. నమ్మదగిందేనా