కరోనా మొదటి దశలో దేశం మొత్తం లాక్డౌన్ విధిస్తే.. వలస కార్మికులను ఆదుకున్న రియల్ హీరో సోనూసోద్. ప్రస్తుతం కోవిడ్ రెండో దశలో కూడా.. దేశ ప్రజలకు నేనున్నానంటూ అభయమిస్తున్నారు. ఇప్పుడు ఆక్సిజన్ కొరత వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. ఈ మరణాలను చూసి చలించిపోయిన సోనూసోద్.. ఇకపై ఆక్సిజన్ కొరత లేకుండా.. ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్లనే ఏర్పాటు చేస్తున్నారు.
ముందుగా నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు. వీటికోసం ఫ్రాన్స్, ఇతర దేశాల నుంచి విక్రయిస్తున్నారు. అయితే ఈ ప్లాంట్లను ముందుగా కోవిడ్ కేసులు అధికంగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్రలతోపాటు, ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. కాగా తొలి ప్లాంట్ ఫ్రాన్స్ నుంచి మరో పది రోజుల్లో భారత్‌కు రానుంది.
'కేవలం ఆక్సిజన్ కొరతతోనే చాలామంది మరణిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసినా.. ఈ సమస్య పరిష్కారం ప్లాంట్ వల్లనేనని భావిస్తున్నా. ఆక్సిజన్‌ను సమయానికి అందించేలా మా వంతు కృషి మేం చేస్తున్నాం' అని సోనూసూద్ తెలిపారు.