నటి శోభితా ధూళిపాళ, తెలుగు స్టార్ హీరో నాగ చైతన్య పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ జంటకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట డ్రెండ్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలుగు సంస్కృతిలో భాగంగా వివాహ ఉత్సవాల ప్రారంభాన్ని సూచించే పసుపు దంచడం వేడుకలో శోభితా పాల్గొన్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో శోభితా ఈ ఫోటోలను పంచుకున్నారు. ఇంకా పెళ్లి వేడుకలు ప్రారంభం అంటూ హింట్ ఇచ్చారు.
ఈ సందర్భంగా, శోభిత బంగారు జాకెట్టు, పగడపు, ఆకుపచ్చ రంగు సిల్క్ చీరను ధరించారు. ఇరువైపులా విభిన్న రంగులతో కూడిన బార్డర్ కలిగిన చీరలో శోభిత మెరిసిపోయారు.
వివాహానికి ముందు జరిగే వేడుకల కోసం బంగారు ఆభరణాలు, ఆకుపచ్చ గాజులతో చూడముచ్చటగా కనిపించింది. ఈ పసుపు దంచుడు కార్యక్రమంలో శోభిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్లో శోభిత, నాగ చైతన్య నిశ్చితార్థం జరిగింది.