మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతా రామం'. సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్ నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్ రామ్ నాకొక బాధ్యతను అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. 1965 నాటి కాలంలో సాగే కథతో తెరకెక్కిన ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది.