ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిగారికి సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతాభివందనాలు మనస్పూర్తిగా తెలియజేస్తోంది. ది. 30/11/2021 ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు గౌ|| ముఖ్యమంత్రిగారి కార్యాలయం నుండి శాస్త్రిగారి ఆరోగ్య పరిస్థితులపై ఎంక్వయిరీ చేస్తూ ఒక ఫోన్ కాల్ వచ్చింది.
ఆసుపత్రి ఖర్చులన్ని ప్రభుత్వమే భరిస్తుందనేది శ్రీ జగన్‌మోహన్ రెడ్డిగారు ఆదేశించినట్లుగా తెలియజేశారు. శ్రీ సిరివెన్నెల 30/11/2021 సాయంత్రం 4.07 గంటలకు స్వర్గస్తులైనారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తమ సంతాపాన్ని తెలియజేశారు.
శాస్త్రిగారి అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రివర్యులు హాజరై, ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తూ మేము కట్టిన అడ్వాన్స్‌ని కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలియజేశారు.
సిరివెన్నెలగారి పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపించి, మా కుటుంబానికి అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ జగన్‌మోహన్ రెడ్డిగారికి మా కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
ధన్యవాదాలు సార్..
- సాయి యోగేశ్వర్ మరియు ఇతర కుటుంబ సభ్యులు