Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శిల్పాశెట్టి వద్ద 6 గంటల పాటు విచారణ.. రాజ్‌కుంద్రా సంస్థకు రాజీనామా

Advertiesment
Shilpa Shetty Resign
, శనివారం, 24 జులై 2021 (15:10 IST)
ఫోర్నోగ్రఫీ కేసులో రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆయన భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె వద్ద శుక్రవారం రాత్రి పొద్దుపోయేంత వరకు ప్రశ్నించారు. క్రైమ్ బ్రాంచ్ బృందం ఆమె ఇంటికి చేరుకుని పలు అంశాలపై ప్రశ్నించారు. ఆ సమయంలో రాజ్ కుంద్రను తమ వెంట తీసుకెళ్లారు. శిల్పాను దాదాపు 6 గంటలపాటు పోలీసులు విచారించారు. 
 
తన భర్త రాజ్‌ కుంద్రా అమాయకుడని, రాజ్‌ కుంద్ర పేరును బంధువు, వ్యాపార భాగస్వామి అయిన ప్రదీప్ భక్షి దుర్వినియోగం చేశారని విచారణలో పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అడల్ట్‌ యాప్‌ గురించి తనకేం తెలియదని, నటిని అయిన తాను ఇతర అమ్మాయిలను ఎలా అశ్లీల చిత్రాల్లో నటించాలని చెప్తానని, ఇది పూర్తిగా అబద్ధమని పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
 
ఇదిలావుంటే, శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రాకు చెందిన సంస్థకు రాజీనామా చేశారు. వయాన్ ఇండస్ట్రీస్‌లో అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత శిల్పా శెట్టికి సమన్లు పంపుతారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఇప్పుడు రాజ్ కుంద్రా సంస్థ వియాన్ ఇండస్ట్రీస్‌కు శిల్పా శెట్టి రాజీనామా చేసినట్లు సమాచారం వెలువడుతున్నది.
 
రాజ్‌కుంద్రాకు చెందిన చాలా వ్యాపారాల్లో శిల్పా భాగస్వామిగా ఉన్నారు. వయాన్‌ సంస్థ నుంచి శిల్పా ఎంత లాభం పొందారు అనే వివరాల సేకరణలో క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు నిమగ్నమై ఉన్నారు. మొత్తం కేసులో శిల్పా ప్రమేయం ఎంత ఉందో తెలుసుకోవడానికి క్రైమ్ బ్రాంచ్ బృందం ప్రయత్నిస్తున్నదని వర్గాలు చెప్తున్నాయి. 
 
అయితే, ముంబై మీడియా కథనాల మేరకు తన భర్త రాజ్ కుంద్రా చేసే బిజినెస్ గురించి శిల్పాకు బాగా తెలుసు. శిల్పా బ్యాంక్ ఖాతాలో ఈ యాప్ నుంచి సంపాదించిన పెద్ద మొత్తాన్ని కుంద్రా చాలాసార్లు వేశాడు. కుంద్రా హాట్‌షాట్స్ యాప్‌లో 20 లక్షలకు పైగా చందాదారులు ఉన్నారని ముంబై పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్ కుంద్రాకు మద్దతిచ్చిన శిల్పాశెట్టి.. నా భర్త అలా చేయలేదు..?