Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాజిద్ ఖాన్‌పై నటి షెర్లిన్ చోప్రా ఫైర్.. అలాంటి పనులు చేయమన్నాడు.. (video)

Sherlyn Chopra
, శుక్రవారం, 21 అక్టోబరు 2022 (19:06 IST)
ప్రముఖ నిర్మాత సాజిద్ ఖాన్‌పై నటి షెర్లిన్ చోప్రా సంచలన ఆరోపణలు చేసింది. సాజిద్ తనపై అభ్యంతర రీతిలో ప్రవర్తించాడని పోలీసులను ఆశ్రయించింది. సాజిద్ తనపై లైంగిక వేధింపులు, దోపిడీ, బెదిరింపులకు పాల్పడినట్టు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
2005 నాటి వేధింపులపై ప్రస్తుతం ఫిర్యాదు చేసేందుకు కారణం అప్పట్లో ఆ ధైర్యం లేకపోవడమే కారణమని చెప్పుకొచ్చింది. కానీ మీటూ ఉద్యమంతో తాను సాజిద్‌పై ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చానని వెల్లడించింది. సాజిద్ వంటి పెద్ద వ్యక్తిపై ఫిర్యాదు చేసేంత ధైర్యం లేదని.. 2008లో మీటూ ఉద్యమంతో మహిళలు ముందుకు రావడంతో.. అతనిని జైలులో పెట్టాలంటూ డిమాండ్ చేసింది. పోలీసులు కూడా ఈ సంగతి అడిగారని.. ఎప్పుడో జరిగిన సంఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడంపై ప్రశ్నించారని.. వాళ్లకీ అదే సమాధానం చెప్పానని షెర్లిన్ పేర్కొంది. మీటూతోనే తనలో ధైర్యం వచ్చిందని వెల్లడించింది. 
 
మీటూ నిందితుడైన సాజిద్ బాధిత మహిళలతో ఎలా ప్రవర్తించాడనేది మీడియా ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాను చూస్తేనే అర్థమైపోతుందని.. శృంగారం కోసం మహిళలను వేధింపులకు గురిచేశాడని.. తనకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ వున్నారంటూ అడిగాడని తెలిపింది. అంతేకాకుండా.. తనతో చాలాసార్లు అభ్యంతరకరంగా వ్యవహరించాడని షెర్లిన్ బయటపెట్టింది. ప్రస్తుతం షెర్లిన్ కామెంట్లు బీటౌన్‌లో వైరల్ అవుతున్నాయి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ బ‌ర్త్‌డే నాడు బిల్లా 4K యుస్‌.లోనూ విడుదల