Shambala team with Adi Saikumar
ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాల్ని పెంచేసిన సంగతి తెలిసిందే. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ వంటి వారు నటిస్తున్నారు. ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ మంగళవారం నాడు మీట్ ఏర్పాటు చేశారు.
హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ అందరూ కూడా మా ట్రైలర్‌ను మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో మాకు సహకరించిన వంశీ, ప్రమోద్, ప్రసాద్ అన్నలకు థాంక్స్. ట్రైలర్ చూసి కిరణ్ అబ్బవరం అభినందించారు. రానా కూడా మా ట్రైలర్ చూసి మెచ్చుకున్నారు. ఈ మూవీకి తనవంతు సాయం చేస్తానని రానా మాటిచ్చారు. హిందీ రిలీజ్ గురించి కూడా అందరూ అడుగుతున్నారు. మీడియా నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ లభిస్తోంది. యుగంధర్ ఈ మూవీని అద్భుతంగా రూపొందించారు. డిసెంబర్ 25న మా చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నాం. మా చిత్రం కచ్చితంగా ఏ ఒక్కరినీ నిరాశపర్చదు. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. కంటెంట్ బాగుంటేనే జనాలు థియేటర్‌లకు వస్తున్నారు. ఇలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీని మీడియా, ఆడియెన్స్ ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ .. శివుడు ఆశీస్సులతో మా శంబాల కు అంతా పాజిటివిటీనే ఎదురవుతోంది. టాలీవుడ్ అంతా కూడా మా కోసం ముందుకు వస్తున్నారు. సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా. టెక్నికల్‌గా ఎంతో గొప్ప స్థాయిలో ఉంటుంది. ట్విస్ట్, టర్న్స్ ఇలా అన్నీ అద్భుతంగా ఉంటాయి. ప్రతీ పాత్ర ఆడియెన్స్‌కి అలా గుర్తుండిపోతుంది. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు. ప్రవీణ్ విజువల్స్, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ ఇలా అన్నీ కూడా హై స్టాండర్డ్‌లో ఉంటాయి. బడ్జెట్ పెరుగుతున్నా కూడా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నాకు సపోర్ట్‌గా నిలిచారు. డిసెంబర్ 25న మా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయండి అని అన్నారు.
హీరోయిన్ అర్చనా అయ్యర్ మాట్లాడుతూ .. శంబాల లాంటి అద్భుతమైన చిత్రంలో మంచి పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాయి. ఇంతకు పదింతలు సినిమా ఉంటుంది. ఆది గారికి ఈ మూవీతో బ్లాక్ బస్టర్ వస్తుంది. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని అందరూ చూడండి అని అన్నారు.
నటుడు రవి వర్మ మాట్లాడుతూ .. యుగంధర్ ముని కథ చెప్పినప్పుడు నా పాత్రే ముఖ్యమని అనుకున్నాను. కానీ ప్రతీ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. టీజర్, ట్రైలర్‌లను మొబైల్స్, టీవీల్లో చూసిన దాని కంటే బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఇంపాక్ట్ ఎక్కువగా అనిపించింది. దర్శక, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని రూపొందించారు అని అన్నారు.
నటుడు ఇంద్రనీల్ మాట్లాడుతూ .. మొబైల్‌లో కంటే పెద్ద స్క్రీన్ మీద ట్రైలర్ చూస్తే ఇంపాక్ట్ ఎక్కువగా అనిపించింది. అందరూ ఎంజాయ్ చేసేలా మా సినిమా ఉంటుంది అని అన్నారు.
నటుడు మధు నందన్ మాట్లాడుతూ .. ప్రభాస్ మా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని నిర్మించారు. మార్కెట్ గురించి ఆలోచించకుండా భారీ బడ్జెట్‌ను కేటాయించారు. యుగంధర్ ముని ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు అని అన్నారు.