Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖం చూడకుండా.. వాటిని మాత్రమే చూస్తున్నారు : శీరత్ కపూర్

సినిమాకు వచ్చే ప్రేక్షకులు హీరోయిన్ల ముఖంలోని కళ, ప్రదర్శించే హావభావాలను చూడకుండా ఎద సైజులు, ధరించే దుస్తులు మాత్రమే చూస్తున్నారని హీరోయిన్ శీరత్ కపూర్ అంటోంది. టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున, సమంతలు ప

Advertiesment
Seerat Kapoor
, బుధవారం, 11 అక్టోబరు 2017 (13:17 IST)
సినిమాకు వచ్చే ప్రేక్షకులు హీరోయిన్ల ముఖంలోని కళ, ప్రదర్శించే హావభావాలను చూడకుండా ఎద సైజులు, ధరించే దుస్తులు మాత్రమే చూస్తున్నారని హీరోయిన్ శీరత్ కపూర్ అంటోంది. టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున, సమంతలు ప్రధాన పాత్రలు పోషించి, ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''రాజుగారి గది 2''. ఈ చిత్రం శుక్రవారం (అక్టోబరు 13వ తేదీ) ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ, నాగార్జునగారి కాంబినేషన్‌లో ఈ చిత్రంలో చాలా సీన్లు ఉంటాయని చెప్పుకొచ్చింది. ఆయనతో పనిచేయడం మాత్రం మరిచిపోలేని విషయమన్నారు. 'స్టార్ హీరో అయినా, అందరినీ సమానంగా చూశారు. సెట్‌లో చాలా వినయంగా ఉండేవారు. సెట్‌లో ఉండే లైట్ బాయ్ నుండి అందరినీ ఎంతో గౌరవంగా పలకరించేవారని' తెలిపింది. 
 
అయితే, థియేటర్లకు వచ్చే ప్రేమక్షకుల ఆలోచనా విధానం మారాల్సి ఉందన్నారు. నటీమణుల అందచందాలను కాకుండా, వారి నటనను చూడాలని కోరారు. ఇటీవల ఆమె ఫోటోషూట్స్ కోసమని వేసుకున్న దుస్తులపై వివిధ రకాల నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. 
 
వీటిపై ఆమె స్పందిస్తూ, 'ఆ ఫోటోషూట్స్ వెనుక ఉన్న బలమైన కాన్సెప్ట్ ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. డిజైనర్ మంచి ఉద్దేశ్యంతో ఆ షూట్ చేశారు. ఆ ఫోటోల్లోని ముఖంలో మహిళ ఎంత బలంగా ఉండగలదో చెప్పే ఫీలింగ్ ఉంటుంది. అది కొంతమందికి మాత్రమే అర్థమైంది. నా ఫేస్‌లో ఉన్న ఫీలింగ్‌ని గుర్తుపట్టలేని కొందరు నా దుస్తులు చూసి రకరకాల కామెంట్స్ చేశారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు' అంటూ ఆమె స్పష్టంచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీ "రంగస్థలం 1985" ఐటం సాంగ్‌కు డీఎస్పీ ట్యూన్స్ సిద్ధం...