రాజుగారి గది-2 సెన్సార్ రిపోర్ట్.. సమంత, నాగ్ నటనే హైలైట్
టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య పెళ్లి బంధంతో ఒక్కటైన వేళ... అక్కినేని నాగార్జున పెళ్లి పనుల్లో బిజీ బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో సమంత, నాగార్జున నటించిన హారర్ మూవీ రాజుగారి గది2 సినిమా విడుదలకు
టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య పెళ్లి బంధంతో ఒక్కటైన వేళ... అక్కినేని నాగార్జున పెళ్లి పనుల్లో బిజీ బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో సమంత, నాగార్జున నటించిన హారర్ మూవీ రాజుగారి గది2 సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.
తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఅండ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ నెల 13వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంలో నాగార్జున, సమంత పాత్రల నటనే హైలైట్‌గా నిలుస్తుందని సెన్సార్ సభ్యులు అంటున్నారు.
ఇక నాగార్జున, సమంత తొలిసారిగా నటించిన హారర్ థ్రిల్లర్ ఇదే. అంతేగాకుండా గ్లామర్ రోల్స్ కనిపిస్తూ.. టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత రాజుగారి గది2లో దెయ్యంగా కనిపించడం విశేషం. ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.